(॥పల్లవి॥)
ఏపాటివారికి నాపాటివాఁడవు
చేపట్టినవారిని చేకొని రక్షింతువు
(॥ఏపాట॥)
విన్నపములు సేయువారి విన్నపములు విందువు
సన్నుతించే వారిని సార మెంతువు
కన్నులఁ జూచేవారిఁ గడఁగి నీవు చూతువు
వున్నవారి కెల్లా నీవు వూరకే వుందువు
(॥ఏపాట॥)
కొలిచినవారల కొలువు లీడేరింతువు
తలఁచినవారల దండ నుందువు
వలసినవారికి వరము లొసఁగుదువు
తెలియనివారల తెరువు నీ వొల్లవు
(॥ఏపాట॥)
శరణు చొచ్చినవారి సరవితోఁ గాతువు
సరుగ నీ వారికిఁ జన విత్తువు
యిరవై యలమేల్మంగ నేలిన శ్రీవేంకటేశ
మడుగనివారికి మట్టుతో నుండుదువు
(||pallavi||)
ebāḍivārigi nābāḍivām̐ḍavu
sebaṭṭinavārini segŏni rakṣhiṁtuvu
(||ebāḍa||)
vinnabamulu seyuvāri vinnabamulu viṁduvu
sannudiṁche vārini sāra mĕṁtuvu
kannulam̐ jūsevārim̐ gaḍam̐gi nīvu sūduvu
vunnavāri kĕllā nīvu vūrage vuṁduvu
(||ebāḍa||)
kŏlisinavārala kŏluvu līḍeriṁtuvu
talam̐sinavārala daṁḍa nuṁduvu
valasinavārigi varamu lŏsam̐guduvu
tĕliyanivārala tĕruvu nī vŏllavu
(||ebāḍa||)
śharaṇu sŏchchinavāri saravidom̐ gāduvu
saruga nī vārigim̐ jana vittuvu
yiravai yalamelmaṁga nelina śhrīveṁkaḍeśha
maḍuganivārigi maṭṭudo nuṁḍuduvu