(॥పల్లవి॥)
ఏపాటి గలవాఁడ నిదివో నేను
నా పాటు చూచి హరి నన్నుఁ గావఁ గదవే
(॥ఏపా॥)
నిలువు నూరు వండీని(?) నిచ్చలు నీదేహమైతే
వొలిసీ దుఃఖములకు నోరువ లేదు
కులము గోటిసేసును గుంపుల జన్మాదులైతే
అలరి వొరులఁబోయి అడిగేదే యెపుడు
(॥ఏపా॥)
పట్టితే పసిఁడి రాలీ బచ్చన సంసారము
గుట్టుదెలియఁ బ్రాణము కూటిచేతిది
వుట్టిపడీ మానుషము వొకనాటి కొకనాఁడు
పట్టికాంతలయెదుట భంగపడే మిదివో
(॥ఏపా॥)
చేరి చెట్టడిచితేను చేటఁడు చుట్టరికాలు
యీరీతి నిన్నాళ్లదాఁకా నెందుండిరో
ఆరిచితే మూరెఁడెక్కీనదే నామకీర్తనము
కూరిమి శ్రీవేంకటేశ కొన నాలికెకును
(||pallavi||)
ebāḍi galavām̐ḍa nidivo nenu
nā pāḍu sūsi hari nannum̐ gāvam̐ gadave
(||ebā||)
niluvu nūru vaṁḍīni(?) nichchalu nīdehamaide
vŏlisī duḥkhamulagu noruva ledu
kulamu goḍisesunu guṁpula janmādulaide
alari vŏrulam̐boyi aḍigede yĕbuḍu
(||ebā||)
paṭṭide pasim̐ḍi rālī bachchana saṁsāramu
guṭṭudĕliyam̐ brāṇamu kūḍisedidi
vuṭṭibaḍī mānuṣhamu vŏganāḍi kŏganām̐ḍu
paṭṭigāṁtalayĕduḍa bhaṁgabaḍe midivo
(||ebā||)
seri sĕṭṭaḍisidenu seḍam̐ḍu suṭṭarigālu
yīrīdi ninnāḽladām̐kā nĕṁduṁḍiro
āriside mūrĕm̐ḍĕkkīnade nāmagīrdanamu
kūrimi śhrīveṁkaḍeśha kŏna nāligĕgunu