ఏపాటి బత్తిగలఁడో యిటు నామీఁద
(॥పల్లవి॥)
ఏపాటి బత్తిగలఁడో యిటు నామీఁద
దాపుగా నా సుద్దులిట్టె తలపెట్టి చూడవే
(॥॥)
మనసు దెలియరాక మర్మము లడుగరాక
వొనగూడి గుట్టుతోడ నున్నదాననే
ఘనుఁ డాతఁ డన్నిటాను కాంతరో నీవై నాను
అనుమానించక మాటలాడించి చూడవే
(॥॥)
కూరిమి గొసరరాక కొంగువట్టి తియ్యరాక
వోరుచుక సిగ్గుతోడ నున్నదాననే
నేరుపరి యీతఁడు నెట్టుకొని నీవైనా
చేరి వద్దివారిచేతఁ జెప్పించి చూడవే
(॥॥)
బలిమి సేయఁగరాక పాసి వుండఁగరాక
వొలిసి కాఁగిటఁ గూడివున్నదాననే
యెలమి శ్రీవేంకటేశుఁ డేలె నన్ను నీవయినా
సొలవక కోరికలు సోదించి చూడవే
(||pallavi||)
ebāḍi battigalam̐ḍo yiḍu nāmīm̐da
dābugā nā sudduliṭṭĕ talabĕṭṭi sūḍave
(||||)
manasu dĕliyarāga marmamu laḍugarāga
vŏnagūḍi guṭṭudoḍa nunnadānane
ghanum̐ ḍādam̐ ḍanniḍānu kāṁtaro nīvai nānu
anumāniṁchaga māḍalāḍiṁchi sūḍave
(||||)
kūrimi gŏsararāga kŏṁguvaṭṭi tiyyarāga
vorusuga siggudoḍa nunnadānane
nerubari yīdam̐ḍu nĕṭṭugŏni nīvainā
seri vaddivārisedam̐ jĕppiṁchi sūḍave
(||||)
balimi seyam̐garāga pāsi vuṁḍam̐garāga
vŏlisi kām̐giḍam̐ gūḍivunnadānane
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu nīvayinā
sŏlavaga korigalu sodiṁchi sūḍave