ఏ వుపాయములు యెక్కడి కెక్కను
(॥పల్లవి॥)
ఏ వుపాయములు యెక్కడి కెక్కను
శ్రీవల్లభ నీ సేవే ఘనము
(॥ఏవు॥)
చదివిన బుద్ధులు శాస్త్రపు యుక్తులే
వెదకును జ్ఞానము వెదకను
తుదఁబుణ్యవిధులు దొడ్డపుణ్యములే
యెదుగాఁ జేయించు యెనయదు విరతి
(॥ఏవు॥)
చెవిలోన కతలు చెప్పినంతవడె
తవిలి జ్ఞానము దాఁటదు
భువి శివములు వుబ్బులంబరవశములె
భవహరమగు నీ భక్తికిఁ జొరదు
(॥ఏవు॥)
నరసురులసేవ నామధారికమే
దురిత హరంబై తూరదు
యిరవగు శ్రీ వేంకటేశ్వర నీవే
కరుణించి మముఁ గాతువు గాక
(||pallavi||)
e vubāyamulu yĕkkaḍi kĕkkanu
śhrīvallabha nī seve ghanamu
(||evu||)
sadivina buddhulu śhāstrabu yuktule
vĕdagunu jñānamu vĕdaganu
tudam̐buṇyavidhulu dŏḍḍabuṇyamule
yĕdugām̐ jeyiṁchu yĕnayadu viradi
(||evu||)
sĕvilona kadalu sĕppinaṁtavaḍĕ
tavili jñānamu dām̐ṭadu
bhuvi śhivamulu vubbulaṁbaravaśhamulĕ
bhavaharamagu nī bhaktigim̐ jŏradu
(||evu||)
narasurulaseva nāmadhārigame
durida haraṁbai tūradu
yiravagu śhrī veṁkaḍeśhvara nīve
karuṇiṁchi mamum̐ gāduvu gāga