ఏ వుపాయము నెఱుఁగ యిదె నీకు విన్నపము
(॥పల్లవి॥)
ఏ వుపాయము నెఱుఁగ యిదె నీకు విన్నపము
శ్రీవల్లభ నీవే రక్షించుకో నీ బంటను
(॥ఏవు॥)
కొందరు తపోమహిమఁ గోరి దొడ్డవా రవుదురు
పొందఁ జదివి కొందరు పూజ్యు లౌదురు
కందువ పుణ్యమున స్వర్గ మేలుదురు కొందరు
ముందే నేనైతే నీ ధర్మమున నుండేవాఁడను
(॥ఏవు॥)
తమ యాత్మనే తలఁచి ధన్యు లౌదురు గొందరు
తిమిరి దానాలు చేసి దివ్యు లౌదురు గొందరు
నెమకి కాయసిద్ధిచే నిత్యు లౌదురు గొందరు
ప్రమదాన నేనైతే నీ ప్రభావమువాఁడను
(॥ఏవు॥)
గట్టిగా సత్యమే ఆడి ఘను లౌదురు గొందరు
పట్టిన వ్రతములను బ్రదుకుదురు గొందరు
యిట్టె యలమేలుమంగ నేలిన శ్రీవేంకటేశ
పట్టి నేనైతే నిన్నుఁ బాడేటివాఁడను
(||pallavi||)
e vubāyamu nĕṟum̐ga yidĕ nīgu vinnabamu
śhrīvallabha nīve rakṣhiṁchugo nī baṁṭanu
(||evu||)
kŏṁdaru tabomahimam̐ gori dŏḍḍavā ravuduru
pŏṁdam̐ jadivi kŏṁdaru pūjyu lauduru
kaṁduva puṇyamuna svarga meluduru kŏṁdaru
muṁde nenaide nī dharmamuna nuṁḍevām̐ḍanu
(||evu||)
tama yātmane talam̐si dhanyu lauduru gŏṁdaru
timiri dānālu sesi divyu lauduru gŏṁdaru
nĕmagi kāyasiddhise nityu lauduru gŏṁdaru
pramadāna nenaide nī prabhāvamuvām̐ḍanu
(||evu||)
gaṭṭigā satyame āḍi ghanu lauduru gŏṁdaru
paṭṭina vradamulanu braduguduru gŏṁdaru
yiṭṭĕ yalamelumaṁga nelina śhrīveṁkaḍeśha
paṭṭi nenaide ninnum̐ bāḍeḍivām̐ḍanu