E vamka nerisidivo yimtesi neevu

ఏ వంక నేరిచితివో యింతేసి నీవు
Language

(॥పల్లవి॥)
ఏ వంక నేరిచితివో యింతేసి నీవు
దేవుల చెరువేలే తిరువేంకటేశా

(॥ఏవం॥)
సారెసారెకు నెత్తేవు సంగడాలా నాచన్నులు
బోరనఁ బట్టేవు చేయిబొందేకోలా
సారె జారె ననెంటేవుచక్రాలా నాపిఱుఁదులు
నేరుతువోయి సాములు నెలఁతలతోడనె

(॥ఏవం॥)
కామించి పెనఁగేవిట్టె కలబమా నాకంబుకంఠము
గోమునఁ గాఁగిలించేవు గోఁతమా మేను
ఆముకొని వొడ్డుకొనే వమ్ములా నాచూపులు
సాము నీకుఁ జెల్లునయ్య సకియలతోడనె

(॥ఏవం॥)
కమ్మటి బుసకొట్టేవు గరిడా నాజవ్వనము
దొమ్మిఁ బట్టితీసేవు ద్రోణమా జడ
ఇమ్ముల శ్రీవేంకేటాద్రి నిట్టె నన్నుఁ గూడితివి
కమ్మి సామమరెనోయి కాంతలతోడనె

(||pallavi||)
e vaṁka nerisidivo yiṁtesi nīvu
devula sĕruvele tiruveṁkaḍeśhā

(||evaṁ||)
sārĕsārĕgu nĕttevu saṁgaḍālā nāsannulu
boranam̐ baṭṭevu seyibŏṁdegolā
sārĕ jārĕ nanĕṁṭevusakrālā nābiṟum̐dulu
neruduvoyi sāmulu nĕlam̐taladoḍanĕ

(||evaṁ||)
kāmiṁchi pĕnam̐geviṭṭĕ kalabamā nāgaṁbugaṁṭhamu
gomunam̐ gām̐giliṁchevu gom̐tamā menu
āmugŏni vŏḍḍugŏne vammulā nāsūbulu
sāmu nīgum̐ jĕllunayya sagiyaladoḍanĕ

(||evaṁ||)
kammaḍi busagŏṭṭevu gariḍā nājavvanamu
dŏmmim̐ baṭṭidīsevu droṇamā jaḍa
immula śhrīveṁkeḍādri niṭṭĕ nannum̐ gūḍidivi
kammi sāmamarĕnoyi kāṁtaladoḍanĕ