E valabudaanave yimdulo neevu

ఏ వలపుదానవే యిందులో నీవు
Language

(॥పల్లవి॥)
ఏ వలపుదానవే యిందులో నీవు
యీవల నావలను నీ యెమ్మె లేమి చెప్పనే

(॥ఏ వలప॥)
చెప్పరాదే నీ వలపు సిగ్గు విడిచి యేమైనా
గొప్పలుగా నచ్చు వ్రాసుకొన్నదానవా
అప్పటి మానవే నీవు అతనిఁ గానని వేళ
వుపరా అగ్గళ్లు వురికినదానవా

(॥ఏ వలప॥)
ఆయ లేవే నీ వలపు అతనికి సెలవుగా
చేయార ముంగురు లందిచ్చిన దానవా
వేయి నేల చెప్పేవే విభునికి సొమ్మెల్లా
పాయక యెదురు వెట్టి పనిగొన్నదానవా

(॥ఏ వలప॥)
యింత యేలే నీ వలపు యింటివారి మఱపించి
పొంతఁ దప్పు పైఁడివట్టి పొందేదానవా
యింతలో శ్రీవేంకటేశుఁ డితఁడిట్టె నన్నుఁ గూడె
చెంతఁ దప మిందుకే సేసినదానవా

(||pallavi||)
e valabudānave yiṁdulo nīvu
yīvala nāvalanu nī yĕmmĕ lemi sĕppane

(||e valaba||)
sĕpparāde nī valabu siggu viḍisi yemainā
gŏppalugā nachchu vrāsugŏnnadānavā
appaḍi mānave nīvu adanim̐ gānani veḽa
vubarā aggaḽlu vuriginadānavā

(||e valaba||)
āya leve nī valabu adanigi sĕlavugā
seyāra muṁguru laṁdichchina dānavā
veyi nela sĕppeve vibhunigi sŏmmĕllā
pāyaga yĕduru vĕṭṭi panigŏnnadānavā

(||e valaba||)
yiṁta yele nī valabu yiṁṭivāri maṟabiṁchi
pŏṁtam̐ dappu paim̐ḍivaṭṭi pŏṁdedānavā
yiṁtalo śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍiṭṭĕ nannum̐ gūḍĕ
sĕṁtam̐ daba miṁduge sesinadānavā