ఏ తపము సేసి(తి)నో యిట నన్ను లాలించి
(॥పల్లవి॥)
ఏ తపము సేసి(తి)నో యిట నన్ను లాలించి
చేతికి విడెమిచ్చేవు చిన్నదాన నేను
(॥ఏత॥)
కుడిదిక్కు సతులెల్లాఁ గొలువు నీకుఁ జేసేరు
యెడమవంక సతులు యిదె మొక్కేరు
వుడివోనివేడుకతో నొడ్డోలగమై వుండి
యెడయక నాతో నవ్వే వేమిబాఁతి నేను
(॥ఏత॥)
విన్నపాలు సేసేవారు వేళగాచుకున్నారు
సన్నసేసేవారు సరుసనే వున్నారు
మన్నించి యేపొద్దు నీవు మాటలు నాతో నాడేవు
యేన్ని చూచితే మరి యెంతదాన నేను
(॥ఏత॥)
పెండిలి నిన్నాడేవారు పీఁటమీఁదనే వున్నారు
నిండువావిమేనవారు నిలుచున్నారు
అండనే శ్రీవేంకటేశ అలమేల్‌మంగపతివి
మెండుగా నన్నేలితివి మేలుదాన నేను
(||pallavi||)
e tabamu sesi(ti)no yiḍa nannu lāliṁchi
sedigi viḍĕmichchevu sinnadāna nenu
(||eda||)
kuḍidikku sadulĕllām̐ gŏluvu nīgum̐ jeseru
yĕḍamavaṁka sadulu yidĕ mŏkkeru
vuḍivoniveḍugado nŏḍḍolagamai vuṁḍi
yĕḍayaga nādo navve vemibām̐ti nenu
(||eda||)
vinnabālu sesevāru veḽagāsugunnāru
sannasesevāru sarusane vunnāru
manniṁchi yebŏddu nīvu māḍalu nādo nāḍevu
yenni sūside mari yĕṁtadāna nenu
(||eda||)
pĕṁḍili ninnāḍevāru pīm̐ṭamīm̐dane vunnāru
niṁḍuvāvimenavāru nilusunnāru
aṁḍane śhrīveṁkaḍeśha alamelmaṁgabadivi
mĕṁḍugā nannelidivi meludāna nenu