ఏ తపము సేసితివొ యిందుకుఁగానె తొల్లి
(॥పల్లవి॥)
ఏ తపము సేసితివొ యిందుకుఁగానె తొల్లి
రాతిరిఁ బగలు నింక రాజ్య మేలవయ్యా
(॥ఏత॥)
తేనెలవంటిమాటలు తెరవ నీతో నాడె
పూని తరితీపులై పొసఁగె నీకు
కానుక లిచ్చెఁ జన్నుల కనకపుబిందెలు
తానకముగాఁ గాఁగిట దాఁచుకొనవయ్యా
(॥ఏత॥)
కలువలవంటిచూపు కాంత నీపై వెదవెట్టె
మొలచినవలపులు మోసు లెత్తెను
పెలుచుఁబయ్యదనె పెండ్లితెర మాఁటుసేసె
బలిమినవ్వుల తలఁబాలు వోయవయ్యా
(॥ఏత॥)
విందులవంటిరతుల వెలఁది నేము సేసె
కందువచుట్టరికము గలసె నీకు
అందపుశ్రీవేంకటేశ ఆయాలు నిన్ను సోఁకించె
సందడి వేడుకలతో చన వియ్యవయ్యా
(||pallavi||)
e tabamu sesidivŏ yiṁdugum̐gānĕ tŏlli
rādirim̐ bagalu niṁka rājya melavayyā
(||eda||)
tenĕlavaṁṭimāḍalu tĕrava nīdo nāḍĕ
pūni taridībulai pŏsam̐gĕ nīgu
kānuga lichchĕm̐ jannula kanagabubiṁdĕlu
tānagamugām̐ gām̐giḍa dām̐sugŏnavayyā
(||eda||)
kaluvalavaṁṭisūbu kāṁta nībai vĕdavĕṭṭĕ
mŏlasinavalabulu mosu lĕttĕnu
pĕlusum̐bayyadanĕ pĕṁḍlidĕra mām̐ṭusesĕ
baliminavvula talam̐bālu voyavayyā
(||eda||)
viṁdulavaṁṭiradula vĕlam̐di nemu sesĕ
kaṁduvasuṭṭarigamu galasĕ nīgu
aṁdabuśhrīveṁkaḍeśha āyālu ninnu som̐kiṁchĕ
saṁdaḍi veḍugalado sana viyyavayyā