E reedi vemdugoneve yidu neevu

ఏ రీతి వేఁడుకొనేవే యిటు నీవు
Language

(॥పల్లవి॥)
ఏ రీతి వేఁడుకొనేవే యిటు నీవు
నీ రతికిఁ గాచుకొని నిలుచున్నవాఁడు

(॥॥)
చేయివట్టుకొని నీచెక్కునొక్కే రమణుని
ఆయములు సోఁక వెంగేలాడితివి
చాయలు సన్నలుఁ జూపి సంగడినున్న యతని
సోయగపుఁ గన్నులను సొలసితివి

(॥॥)
తమ్ముల మిడుచు నీ దప్పి దేరిచే విభుని
బొమ్మల జంకించి సొలపులఁ దిట్టితి
సోమ్ముల నింపుచు నిన్నుఁ జొక్కించే యాతని
దొమ్మితోఁ బాదము దొక్కి తొడపై నెక్కితివి

(॥॥)
చెనకి కాఁగిటగూడి శ్రీవేంకటేశ్వరుని
ననుపున నలయించి నవ్వితివి
మనసు మర్మమెరిఁగి మన్నించే యీతని
తనివార మోవియిచ్చి దక్కఁగొంటివి

(||pallavi||)
e rīdi vem̐ḍugŏneve yiḍu nīvu
nī radigim̐ gāsugŏni nilusunnavām̐ḍu

(||||)
seyivaṭṭugŏni nīsĕkkunŏkke ramaṇuni
āyamulu som̐ka vĕṁgelāḍidivi
sāyalu sannalum̐ jūbi saṁgaḍinunna yadani
soyagabum̐ gannulanu sŏlasidivi

(||||)
tammula miḍusu nī dappi derise vibhuni
bŏmmala jaṁkiṁchi sŏlabulam̐ diṭṭidi
sommula niṁpusu ninnum̐ jŏkkiṁche yādani
dŏmmidom̐ bādamu dŏkki tŏḍabai nĕkkidivi

(||||)
sĕnagi kām̐giḍagūḍi śhrīveṁkaḍeśhvaruni
nanubuna nalayiṁchi navvidivi
manasu marmamĕrim̐gi manniṁche yīdani
tanivāra moviyichchi dakkam̐gŏṁṭivi