ఏ పను లెవ్వరికిఁగల దెంత యంతేకాని
(॥పల్లవి॥)
ఏ పను లెవ్వరికిఁగల దెంత యంతేకాని
శ్రీపతియాణా(నా)జ్ఞలు మీఁఱగ చింతింపఁగఁ దరమా
(॥ఏపను॥)
సులభంబున సుఖియించుటఁబోలదు సొంపుగ భిక్షాన్నముతోడ
పలు లంపటములఁబడి ఘడియించేటి బహుధన మిగదియేల
తొలుతే జంతువులను వ్రాసెను తొడఁగి నుదిట బ్రహ్మ
కలది దైవికములఁ గడచెదమని కడుబడలెదరేలో నరులు
(॥ఏపను॥)
పాపము సేయక మానుటఁ బోలదుపరమశాంతితోను
కోపము మానక బహుపుణ్యంబులు కోట్లు చేసినను
దీపింపఁగ వేదశాస్త్రములు తెలిపెడి యర్థ మిదే
కైపుగ నిది దెలియక జీవులు కడుబడలెదరేలో నరులు
(॥ఏపను॥)
సహజము జగమున యీపనులెల్లను జరగుచు నుండుట స్వభావము
గహనము ప్రాణులకే పనులను ననఁ గాదన కర్తన్య మింతేది
యిహమేల శ్రీవేంకటేశ్వరు నమ్మిన యీతనిశ రణాగతులు
మహిలోఁజూతురు నవ్వుదు రిటునలె మానరేటికో నరులు
(||pallavi||)
e panu lĕvvarigim̐gala dĕṁta yaṁtegāni
śhrībadiyāṇā(nā)jñalu mīm̐ṟaga siṁtiṁpam̐gam̐ daramā
(||ebanu||)
sulabhaṁbuna sukhiyiṁchuḍam̐boladu sŏṁpuga bhikṣhānnamudoḍa
palu laṁpaḍamulam̐baḍi ghaḍiyiṁcheḍi bahudhana migadiyela
tŏlude jaṁtuvulanu vrāsĕnu tŏḍam̐gi nudiḍa brahma
kaladi daivigamulam̐ gaḍasĕdamani kaḍubaḍalĕdarelo narulu
(||ebanu||)
pābamu seyaga mānuḍam̐ boladubaramaśhāṁtidonu
kobamu mānaga bahubuṇyaṁbulu koṭlu sesinanu
dībiṁpam̐ga vedaśhāstramulu tĕlibĕḍi yardha mide
kaibuga nidi dĕliyaga jīvulu kaḍubaḍalĕdarelo narulu
(||ebanu||)
sahajamu jagamuna yībanulĕllanu jaragusu nuṁḍuḍa svabhāvamu
gahanamu prāṇulage panulanu nanam̐ gādana kardanya miṁtedi
yihamela śhrīveṁkaḍeśhvaru nammina yīdaniśha raṇāgadulu
mahilom̐jūduru navvudu riḍunalĕ mānareḍigo narulu