E mayyaa vo yayya ye mayyaa ne

ఏ మయ్యా వో యయ్య యే మయ్యా నే
Language

(॥పల్లవి॥)
ఏ మయ్యా వో యయ్య యే మయ్యా నే-
మేమి బాఁతి నీకు నేల పిలిచే వయ్యా

(॥ఏ మయ్యా॥)
నీ సరివారమా నేము నిండు సరసము లాడ
ఆసలఁ బెట్టక మాను మన్నామానవు
కాసు సేయనిపనికి కమ్మటి నాన వెట్టేవు
వేసరక నీవు మావెంట వెంటఁ బాయవు

(॥ఏ మయ్యా॥)
చనవరులమా నేము సంగడి నీతోఁ గూచుండ
పొనిగి వోయినసుద్ది పో నియ్యవు
ననిచినవావు లెల్ల నాటికి నాఁడే కాక
కొనవేసి మమ్ము నేల కూరిమి గొసరేవు

(॥ఏ మయ్యా॥)
నిన్ను మీరెవారమా నేఁ డేమి సేసినాను
కన్నులఁ దప్పక చూచి కలసితివి
యిన్నిటా శ్రీవెంకటేశ యిందరు నిట్టె చూడఁగ
నన్ను మన్నించి నాతోనె నవ్వులు నవ్వేవు

(||pallavi||)
e mayyā vo yayya ye mayyā ne-
memi bām̐ti nīgu nela pilise vayyā

(||e mayyā||)
nī sarivāramā nemu niṁḍu sarasamu lāḍa
āsalam̐ bĕṭṭaga mānu mannāmānavu
kāsu seyanibanigi kammaḍi nāna vĕṭṭevu
vesaraga nīvu māvĕṁṭa vĕṁṭam̐ bāyavu

(||e mayyā||)
sanavarulamā nemu saṁgaḍi nīdom̐ gūsuṁḍa
pŏnigi voyinasuddi po niyyavu
nanisinavāvu lĕlla nāḍigi nām̐ḍe kāga
kŏnavesi mammu nela kūrimi gŏsarevu

(||e mayyā||)
ninnu mīrĕvāramā nem̐ ḍemi sesinānu
kannulam̐ dappaga sūsi kalasidivi
yinniḍā śhrīvĕṁkaḍeśha yiṁdaru niṭṭĕ sūḍam̐ga
nannu manniṁchi nādonĕ navvulu navvevu