E mamda meegedoda nimduge veragayyaa

ఏ మంద మీకెతోడ నిందుకే వెరగయ్యా
Language

(॥పల్లవి॥)
ఏ మంద మీకెతోడ నిందుకే వెరగయ్యా
యీమై పాదాలు గడుగ నిదియు నేమైనది

(॥ఏమం॥)
ఇదివో కృష్ణుడు మా ఇంటిపాలు నేయిఁ ద్రాగి
చెదర రుత్తకుండలు సేసి పోఁగాను
యెదుట యశోదఁ దెచ్చి యిటె చూపఁబూతేను
అదన నీరాళ్లుఁ గూరాళన్నియుఁబాలైనది

(॥ఏమం॥)
అలవీది వొకలేమ అమ్ముడుఁబండ్లగంప
కొల్లలాడీ కృష్ణుఁడని కోరి చెప్పఁగా
చుల్లరపు టాగడాలు చూపఁబోతే గంపనిండా
పెల్లుమాణికా లున్నవి బేలుపోయ మాఁటా

(॥ఏమం॥)
పంతపు శ్రీవేంకటాద్రి పతియైన కృష్ణుడు
యెంతటి మాయలవాఁడో యేమిమందులో
అంతటిబాలుని వట్టియారడిఁ బెట్టితిమని
చెంతల యశోద దూర చిన్నఁబోవవలసె

(||pallavi||)
e maṁda mīgĕdoḍa niṁduge vĕragayyā
yīmai pādālu gaḍuga nidiyu nemainadi

(||emaṁ||)
idivo kṛṣhṇuḍu mā iṁṭibālu neyim̐ drāgi
sĕdara ruttaguṁḍalu sesi pom̐gānu
yĕduḍa yaśhodam̐ dĕchchi yiḍĕ sūbam̐būdenu
adana nīrāḽlum̐ gūrāḽanniyum̐bālainadi

(||emaṁ||)
alavīdi vŏgalema ammuḍum̐baṁḍlagaṁpa
kŏllalāḍī kṛṣhṇum̐ḍani kori sĕppam̐gā
sullarabu ṭāgaḍālu sūbam̐bode gaṁpaniṁḍā
pĕllumāṇigā lunnavi beluboya mām̐ṭā

(||emaṁ||)
paṁtabu śhrīveṁkaḍādri padiyaina kṛṣhṇuḍu
yĕṁtaḍi māyalavām̐ḍo yemimaṁdulo
aṁtaḍibāluni vaṭṭiyāraḍim̐ bĕṭṭidimani
sĕṁtala yaśhoda dūra sinnam̐bovavalasĕ