E mamchidaananamtaa nannimtagaa mannimchidivi

ఏ మంచిదాననంటా నన్నింతగా మన్నించితివి
Language

(॥పల్లవి॥)
ఏ మంచిదాననంటా నన్నింతగా మన్నించితివి
కామించి నీ కృప నాపైఁ గలిగే నీవేళను

(॥ఏమం॥)
కోరి నాపయ్యదలోనికుచములే కావా
సారెసారె నిన్ను నొత్తి సాదించినవి
నారుకొన్ననాసెలవినవ్వు లివియే కావా
వారించరాక నిన్ను వలలఁబెట్టినవి

(॥ఏమం॥)
చొక్కపునాకనుఁగోనచూపు లివియే కావా
ఇక్కువల నిన్ను బయలీఁదించినవి
పక్కన నాపెదవుల పైమాటలే కావా
చిక్కించి నీమనసెల్లా జిమ్మిరేఁచినవి

(॥ఏమం॥)
మించిననారతులసమేళము లివె కావా
పొంచి నీకు చెమటలు పుట్టించినవి
అంచెల శ్రీవేంకటేశ యలమేల్‌మంగపతివి
యెంచేనాపొందులే కావా ఇంపులు నించినవి

(||pallavi||)
e maṁchidānanaṁṭā nanniṁtagā manniṁchidivi
kāmiṁchi nī kṛpa nābaim̐ galige nīveḽanu

(||emaṁ||)
kori nābayyadalonigusamule kāvā
sārĕsārĕ ninnu nŏtti sādiṁchinavi
nārugŏnnanāsĕlavinavvu liviye kāvā
vāriṁcharāga ninnu valalam̐bĕṭṭinavi

(||emaṁ||)
sŏkkabunāganum̐gonasūbu liviye kāvā
ikkuvala ninnu bayalīm̐diṁchinavi
pakkana nābĕdavula paimāḍale kāvā
sikkiṁchi nīmanasĕllā jimmirem̐sinavi

(||emaṁ||)
miṁchinanāradulasameḽamu livĕ kāvā
pŏṁchi nīgu sĕmaḍalu puṭṭiṁchinavi
aṁchĕla śhrīveṁkaḍeśha yalamel‌maṁgabadivi
yĕṁchenābŏṁdule kāvā iṁpulu niṁchinavi