E mamchidaana nai neeyeduda numde nenu

ఏ మంచిదాన నై నీయెదుట నుండే నేను
Language

(॥పల్లవి॥)
ఏ మంచిదాన నై నీయెదుట నుండే నేను
వేమారు నూదితేఁ జల్ల వేఁడియై తోఁచురా

(॥ఏమంచి॥)
నేనే మనిన నీకు నెరుసు లై తోఁచీని
మౌనాన నుండేఁ గాని మాఁట లాడించకురా
వూని నే దొలుతె నాకు వొల్లనివాన నింతే
తేనెలు వోయఁ బోయినా తెగి చేఁదే తోచురా

(॥ఏ మంచి॥)
కడునే దగ్గరి యుంటె కావ లై తోఁచీని
యెడసి వుండేఁ గాని యిట్టె పిలువకురా
గొడవ వెట్టుక నేను గుండెబెద రైనదాన
నడుమను గోర గీరినా నే రై పారురా

(॥ఏమంచి॥)
పైకొని కాఁగిలించి బలుము లై తోఁచీని
యేకతాన నుండేఁ గాని యిక్కువ రేఁచకురా
యీకడ శ్రీవెంకటేశ యెనసితిఁ గాని నిన్నె
నీకు నే నిజ మాడితె నిష్ణూరమై తోఁచురా

(||pallavi||)
e maṁchidāna nai nīyĕduḍa nuṁḍe nenu
vemāru nūdidem̐ jalla vem̐ḍiyai tom̐surā

(||emaṁchi||)
nene manina nīgu nĕrusu lai tom̐sīni
maunāna nuṁḍem̐ gāni mām̐ṭa lāḍiṁchagurā
vūni ne dŏludĕ nāgu vŏllanivāna niṁte
tenĕlu voyam̐ boyinā tĕgi sem̐de tosurā

(||e maṁchi||)
kaḍune daggari yuṁṭĕ kāva lai tom̐sīni
yĕḍasi vuṁḍem̐ gāni yiṭṭĕ piluvagurā
gŏḍava vĕṭṭuga nenu guṁḍĕbĕda rainadāna
naḍumanu gora gīrinā ne rai pārurā

(||emaṁchi||)
paigŏni kām̐giliṁchi balumu lai tom̐sīni
yegadāna nuṁḍem̐ gāni yikkuva rem̐sagurā
yīgaḍa śhrīvĕṁkaḍeśha yĕnasidim̐ gāni ninnĕ
nīgu ne nija māḍidĕ niṣhṇūramai tom̐surā