(॥పల్లవి॥)
ఏ మాఁట కే మాఁట యేలరా
నా మోము చూడవే నవ్వే నేను
(॥ఏమాఁ॥)
వద్దు వోరా వాదులు వొక్క-
సుద్ది చెప్పే రావే సొలయక
కొద్ది నుండదురా కోపము అయితేఁ
గదు లేవే నిన్నుఁ గలసే నేను
(॥ఏమాఁ॥)
సారె నేలరా చలము మరి
కోరికెల్లఁ జెల్లె కొంకువాసెనే
మేరమీరేవేరా మెల్లనే తొల్లె
తేరపనులకునుఁదెగువేలే
(॥ఏమాఁ॥)
చెల్లెరా నీ చేఁతలూ
అల్లనాఁడె నే నంటిఁగదె
వెల్ల విరయితి శ్రీ వేంకటేశ నిన్నుఁ
గొల్లగాఁ గూడితి కొసర నేలే
(||pallavi||)
e mām̐ṭa ke mām̐ṭa yelarā
nā momu sūḍave navve nenu
(||emām̐||)
vaddu vorā vādulu vŏkka-
suddi sĕppe rāve sŏlayaga
kŏddi nuṁḍadurā kobamu ayidem̐
gadu leve ninnum̐ galase nenu
(||emām̐||)
sārĕ nelarā salamu mari
korigĕllam̐ jĕllĕ kŏṁkuvāsĕne
meramīreverā mĕllane tŏllĕ
terabanulagunum̐dĕguvele
(||emām̐||)
sĕllĕrā nī sem̐talū
allanām̐ḍĕ ne naṁṭim̐gadĕ
vĕlla virayidi śhrī veṁkaḍeśha ninnum̐
gŏllagām̐ gūḍidi kŏsara nele