(॥పల్లవి॥)
ఏ కాంత సేసినవో యీ చేఁతలు
ఆకె యెటువంటిదో ఆనతియ్యవయ్యా
(॥ఏ కాంత॥)
పుప్పొడి దాఁకినచోటు పువ్వులవేసినవాటు
చొప్పు నీ మేన నున్నది చూచుకోవయ్యా
చిప్పిలిపారేటియేరు చిమ్మనఁగోవిపన్నీరు
తెప్పలఁ దేలేవు నీవే తెలుసుకోవయ్యా
(॥ఏ కాంత॥)
కురులువట్టిన పట్టు కూడని చొల్లెపు చుట్టు
అరసి నీ చెలులనే అడుగవయ్యా
వురము ముద్రల పొత్తు వుదుటుఁజన్నుల వొత్తు
సరుగ నీకు నీవే విచారించుకోవయ్యా
(॥ఏ కాంత॥)
చెక్కున నుండిన రేక చిన్నికొనగోరి జోక
యిక్కువ లవిగో నీవే యెంచుకోవయ్యా
గక్కన శ్రీవేంకటేశ కాఁగిట నన్నేలితివి
తక్కక నీ వేడుకలు తలఁచుకోవయ్యా
(||pallavi||)
e kāṁta sesinavo yī sem̐talu
āgĕ yĕḍuvaṁṭido ānadiyyavayyā
(||e kāṁta||)
puppŏḍi dām̐kinasoḍu puvvulavesinavāḍu
sŏppu nī mena nunnadi sūsugovayyā
sippilibāreḍiyeru simmanam̐govibannīru
tĕppalam̐ delevu nīve tĕlusugovayyā
(||e kāṁta||)
kuruluvaṭṭina paṭṭu kūḍani sŏllĕbu suṭṭu
arasi nī sĕlulane aḍugavayyā
vuramu mudrala pŏttu vuduḍum̐jannula vŏttu
saruga nīgu nīve visāriṁchugovayyā
(||e kāṁta||)
sĕkkuna nuṁḍina rega sinnigŏnagori joga
yikkuva lavigo nīve yĕṁchugovayyā
gakkana śhrīveṁkaḍeśha kām̐giḍa nannelidivi
takkaga nī veḍugalu talam̐sugovayyā