E kaalamu naamane yeṟimgina daasulagu

ఏ కాలము నామనే యెఱిఁగిన దాసులకు
Language

(॥పల్లవి॥)
ఏ కాలము నామనే యెఱిఁగిన దాసులకు
దాకొనీ శ్రీహరిభక్తి దారణ గలిగితేను

(॥ఏకాల॥)
వుడివొడేకాలము వొక్క తతి రావద్దు
చెడని శ్రీహరిభక్తిచెట్టుకట్టితే
తొడుకు మేయఁగరాదు తూర్పెత్తితేఁ బొల్లు వోదు
బడినే శ్రీహరిభక్తి పంట వండితేను

(॥ఏకాల॥)
వలువ దీసితేఁ బోదు వాడుకొంటే వెల్తి గాదు
కొలచి శ్రీహరిభక్తి కుప్ప చేసితే
యెలుకకు దినరాదు యెన్నాళ్ళున్నాఁ జివుకదు
తలఁచి హరిభక్తి చిత్తపుగాదెఁ బెట్టితే

(॥ఏకాల॥)
కఱవుకు లోఁ గాదు సుంకరవానికి నబ్బదు
యెఱుకతో హరిభక్తి యిల్లు నిండితే
నెఱవై శ్రీవేంకటేశ నీకృపగలవారికి
గుఱిగాఁగ హరిభక్తి కూడపెట్టుకొంటేను

(||pallavi||)
e kālamu nāmane yĕṟim̐gina dāsulagu
dāgŏnī śhrīharibhakti dāraṇa galigidenu

(||egāla||)
vuḍivŏḍegālamu vŏkka tadi rāvaddu
sĕḍani śhrīharibhaktisĕṭṭugaṭṭide
tŏḍugu meyam̐garādu tūrbĕttidem̐ bŏllu vodu
baḍine śhrīharibhakti paṁṭa vaṁḍidenu

(||egāla||)
valuva dīsidem̐ bodu vāḍugŏṁṭe vĕldi gādu
kŏlasi śhrīharibhakti kuppa seside
yĕlugagu dinarādu yĕnnāḽḽunnām̐ jivugadu
talam̐si haribhakti sittabugādĕm̐ bĕṭṭide

(||egāla||)
kaṟavugu lom̐ gādu suṁkaravānigi nabbadu
yĕṟugado haribhakti yillu niṁḍide
nĕṟavai śhrīveṁkaḍeśha nīkṛpagalavārigi
guṟigām̐ga haribhakti kūḍabĕṭṭugŏṁṭenu