ఏ దుపాయము యే నిన్నుఁ జేరుటకు
(॥పల్లవి॥)
ఏ దుపాయము యే నిన్నుఁ జేరుటకు
ఆదినంత్యములేని అచ్యుతమూరితివి
(॥ఏదు॥)
వెలయ నీగుణములు వినుతించేనంటే
తెలియ నీవు గుణాతీతుఁడవు
చెలరేఁగి నిను మతిఁ జింతించేనంటే
మలసి నీ వచింత్య మహిముఁడవు
(॥ఏదు॥)
పొదిగి చేతుల నిన్నుఁ బూజించేనంటే
కదిసి నీవు విశ్వకాయుఁడవు
అదన నేమైన సమర్పించేనంటే
సదరమై అవాప్త సకలకాముఁడవు
(॥ఏదు॥)
కన్నుల చేత నిన్నుఁ గనుఁగొనేనంటే
సన్నిధి దొరక నగోచరుఁడవు
యిన్నిటాను శ్రీవేంకటేశ నీవు గలవని
వన్నెల శరణనే వాక్యమే చాలు
(||pallavi||)
e dubāyamu ye ninnum̐ jeruḍagu
ādinaṁtyamuleni achyudamūridivi
(||edu||)
vĕlaya nīguṇamulu vinudiṁchenaṁṭe
tĕliya nīvu guṇādīdum̐ḍavu
sĕlarem̐gi ninu madim̐ jiṁtiṁchenaṁṭe
malasi nī vasiṁtya mahimum̐ḍavu
(||edu||)
pŏdigi sedula ninnum̐ būjiṁchenaṁṭe
kadisi nīvu viśhvagāyum̐ḍavu
adana nemaina samarbiṁchenaṁṭe
sadaramai avāpta sagalagāmum̐ḍavu
(||edu||)
kannula seda ninnum̐ ganum̐gŏnenaṁṭe
sannidhi dŏraga nagosarum̐ḍavu
yinniḍānu śhrīveṁkaḍeśha nīvu galavani
vannĕla śharaṇane vākyame sālu