E baasa kiyyagoneve yippudu neevu

ఏ బాస కియ్యకొనేవే యిప్పుడు నీవు
Language

(॥పల్లవి॥)
ఏ బాస కియ్యకొనేవే యిప్పుడు నీవు
వాబలిమి మాటల వాదుకోపఁ గాని

(॥ఏబా॥)
నెట్టన నీవు నన్నాడే నిందలెల్లాఁ దప్పదని
చుట్టి మరుగుడి వాసి చొచ్చి వెళ్ళేవా
నట్టనడుమ నేనైనా ననలయలుగులను
కిట్టి నానిజము మించ గెలిచేఁ గాని

(॥ఏబా॥)
ఆలాగువాఁడ నేనని చిలుకజోదుల
వాలు తిరుమిక్కిళ్ళకు(?) వడి నిల్చేవా
వాలాయించి నేనైనా నావల్లఁ గల్లలేకుండా
బాలకోవిలభ్రతముఁ బలికించేఁ గాని

(॥ఏబా॥)
ఇలనేఁ గపటినని యీపూవుఁ దేనెనీటను
నెలకొని నీవు మునిఁగి లేచేవా
కలసితి నేను శ్రీ వేంకటపతినిపుడని
తొలుత నీచన్నుదిబ్బాలు దొడికేఁ గాని

(||pallavi||)
e bāsa kiyyagŏneve yippuḍu nīvu
vābalimi māḍala vādugobam̐ gāni

(||ebā||)
nĕṭṭana nīvu nannāḍe niṁdalĕllām̐ dappadani
suṭṭi maruguḍi vāsi sŏchchi vĕḽḽevā
naṭṭanaḍuma nenainā nanalayalugulanu
kiṭṭi nānijamu miṁcha gĕlisem̐ gāni

(||ebā||)
ālāguvām̐ḍa nenani silugajodula
vālu tirumikkiḽḽagu(?) vaḍi nilsevā
vālāyiṁchi nenainā nāvallam̐ gallaleguṁḍā
bālagovilabhradamum̐ baligiṁchem̐ gāni

(||ebā||)
ilanem̐ gabaḍinani yībūvum̐ denĕnīḍanu
nĕlagŏni nīvu munim̐gi lesevā
kalasidi nenu śhrī veṁkaḍabadinibuḍani
tŏluda nīsannudibbālu dŏḍigem̐ gāni