దురితదేహులే తొల్లియును శ్రీ
(॥పల్లవి॥)
దురితదేహులే తొల్లియును శ్రీ-
హరి భజించి నిత్యాధికులైరి
(॥దురిత॥)
అనంతకోటి మహామునులు ఈ-
సనకాదులు నిశ్చలయశులు
ఇనశశినయనుని నితనిని మును
గని భజించి గత కల్మషులైరి
(॥దురిత॥)
అతిశయమతులు మహామహులు సుఖ-
రతి విముఖులును చిరంతనులు
హిత విచారమతి నితనిని సం-
తతమును భజించి ధన్యులైరి
(॥దురిత॥)
దేవతాధిపులు దివ్యులును కడుఁ-
బావనులును తగ బరహితులు
యీ వేంకటపతి నితనిని
సేవించి సుఖాంచితమతులైరి
(||pallavi||)
duridadehule tŏlliyunu śhrī-
hari bhajiṁchi nityādhigulairi
(||durida||)
anaṁtagoḍi mahāmunulu ī-
sanagādulu niśhchalayaśhulu
inaśhaśhinayanuni nidanini munu
gani bhajiṁchi gada kalmaṣhulairi
(||durida||)
adiśhayamadulu mahāmahulu sukha-
radi vimukhulunu siraṁtanulu
hida visāramadi nidanini saṁ-
tadamunu bhajiṁchi dhanyulairi
(||durida||)
devadādhibulu divyulunu kaḍum̐-
bāvanulunu taga barahidulu
yī veṁkaḍabadi nidanini
seviṁchi sukhāṁchidamadulairi