Drshtaamta midi dappadu telusugovalem gaani

దృష్టాంత మిది దప్పదు తెలుసుకోవలెఁ గాని
Language

(॥పల్లవి॥)
దృష్టాంత మిది దప్పదు తెలుసుకోవలెఁ గాని
సృష్టికి మూలమైన శ్రీపతిదాసులకు

(॥దృష్టాంత॥)
పుటము వెట్టిన పైఁడి పొందుగా నెత్తు దరిగి
తటుకున వన్నె కెక్కినటువలెనే
చిటుకన హరిభక్తిచేత మలినము మాని
ఘటన జీవాత్ముఁడు ఘనుఁడై వెలయును

(॥దృష్టాంత॥)
ఆరయ చిట్టము గట్టినటువంటి మాణికము
సారసానఁ బట్టితే నుజ్జ్వలమైనట్టు
బోరున నాచార్యునిబోధచేత నిశ్చలుఁడై
ధారుణిలో శిష్యుఁడు సంతత పుణ్యుఁడౌను

(॥దృష్టాంత॥)
అట్టే మాఁగుడు గప్పిన యద్దము దోమితేను
గట్టిగా విశ్వ మెల్లాఁ బ్రకాశించినట్టు
గుట్టున శ్రీవేంకటేశుఁ గొలిచి కృతకృత్యుఁడై
దట్టపు హరి భక్తుఁడు ధర్మచిత్తుఁ డౌను

(||pallavi||)
dṛṣhṭāṁta midi dappadu tĕlusugovalĕm̐ gāni
sṛṣhṭigi mūlamaina śhrībadidāsulagu

(||dṛṣhṭāṁta||)
puḍamu vĕṭṭina paim̐ḍi pŏṁdugā nĕttu darigi
taḍuguna vannĕ kĕkkinaḍuvalĕne
siḍugana haribhaktiseda malinamu māni
ghaḍana jīvātmum̐ḍu ghanum̐ḍai vĕlayunu

(||dṛṣhṭāṁta||)
āraya siṭṭamu gaṭṭinaḍuvaṁṭi māṇigamu
sārasānam̐ baṭṭide nujjvalamainaṭṭu
boruna nāsāryunibodhaseda niśhchalum̐ḍai
dhāruṇilo śhiṣhyum̐ḍu saṁtada puṇyum̐ḍaunu

(||dṛṣhṭāṁta||)
aṭṭe mām̐guḍu gappina yaddamu domidenu
gaṭṭigā viśhva mĕllām̐ bragāśhiṁchinaṭṭu
guṭṭuna śhrīveṁkaḍeśhum̐ gŏlisi kṛtakṛtyum̐ḍai
daṭṭabu hari bhaktum̐ḍu dharmasittum̐ ḍaunu