(॥పల్లవి॥)
దోసము లేదను తొయ్యలిని
వాసుల సిగ్గులు వంచెద నీకు
(॥దోము॥)
నిక్కల గంటిని నిను నా పాదము
తక్కక యేఁటికో తాఁకె నని
యిక్కడ మేల్కొని యింతలో వరగై
మొక్కె నిదివో మునుకొని నీకు
(॥దోము॥)
నెమ్మది నే నట నీ వదనమును
యిమ్ముల దమ్ముల మిడితి నటా
కమ్మి యందులకే కడిగెదఁ బన్నీట
చిమ్ముల పంతము చేరును నీకు
(॥దోము॥)
చెందినకౌఁగిటి చే తలలో నట
కిందు పరచి జంకింతు నటా
యిందుకే శ్రీవేంకటేశ్వర నిజముగ
పొందితి విచ్చలఁ బొస గితి నీకు
(||pallavi||)
dosamu ledanu tŏyyalini
vāsula siggulu vaṁchĕda nīgu
(||domu||)
nikkala gaṁṭini ninu nā pādamu
takkaga yem̐ṭigo tām̐kĕ nani
yikkaḍa melgŏni yiṁtalo varagai
mŏkkĕ nidivo munugŏni nīgu
(||domu||)
nĕmmadi ne naḍa nī vadanamunu
yimmula dammula miḍidi naḍā
kammi yaṁdulage kaḍigĕdam̐ bannīḍa
simmula paṁtamu serunu nīgu
(||domu||)
sĕṁdinagaum̐giḍi se talalo naḍa
kiṁdu parasi jaṁkiṁtu naḍā
yiṁduge śhrīveṁkaḍeśhvara nijamuga
pŏṁdidi vichchalam̐ bŏsa gidi nīgu