Dosa mela kattugonee todane taanu

దోస మేల కట్టుకొనీ తోడనె తాను
Language

(॥పల్లవి॥)
దోస మేల కట్టుకొనీ తోడనె తాను
వీసమంత పనికిఁగా వేసరించేనా

(॥దోస॥)
మారునమ్ము లేడ నామనసేడ నాటఁ జొచ్చె
యీరీతిపనులకు యెదురా నేను
గోరఁ బొయ్యేదానికిఁగా గొడ్డలేల రమణుఁడు
ఆరసి యడుగ నేల అవుఁ గాదనేనా

(॥దోస॥)
వెన్నెలలయెండ లెంత వీరిడినాదేహ మెంత
యిన్నేసిపాట్ల కెల్ల యెదురా నేను
వెన్న నున్నగా నూర వెస నుక్కుగుండ్లేల
నన్నుఁ దా నేమి సేసినా నాలిఁ బెట్టేనా

(॥దోస॥)
చల్లగాలివిష మెంత జవ్వనపు పాయ మెంత
యిల్లిదే యీవిరహన కెదురా నేను
బల్లిదుఁడై శ్రీవేంకటపతి నన్ను నిదె కూడె
చెల్లునంటా మన్నించి చేకొనకుండేనా

(||pallavi||)
dosa mela kaṭṭugŏnī toḍanĕ tānu
vīsamaṁta panigim̐gā vesariṁchenā

(||dosa||)
mārunammu leḍa nāmanaseḍa nāḍam̐ jŏchchĕ
yīrīdibanulagu yĕdurā nenu
goram̐ bŏyyedānigim̐gā gŏḍḍalela ramaṇum̐ḍu
ārasi yaḍuga nela avum̐ gādanenā

(||dosa||)
vĕnnĕlalayĕṁḍa lĕṁta vīriḍinādeha mĕṁta
yinnesibāṭla kĕlla yĕdurā nenu
vĕnna nunnagā nūra vĕsa nukkuguṁḍlela
nannum̐ dā nemi sesinā nālim̐ bĕṭṭenā

(||dosa||)
sallagāliviṣha mĕṁta javvanabu pāya mĕṁta
yillide yīvirahana kĕdurā nenu
ballidum̐ḍai śhrīveṁkaḍabadi nannu nidĕ kūḍĕ
sĕllunaṁṭā manniṁchi segŏnaguṁḍenā