దొరవు సారెకు నిన్ను దూరవచ్చునా
(॥పల్లవి॥)
దొరవు సారెకు నిన్ను దూరవచ్చునా
యిరవై నీవే మమ్ము నేలేవు గాక
(॥దొర॥)
మనసువచ్చితే నీవే మన్నించేవుగాక మమ్ము
యెనలేక కొసరంగా నేమి వచ్చీని
వనములతీగెలు వసంతకాలమునాఁడు
ఘనమై పూచినపాటే కాచీఁగాక
(॥దొర॥)
కరుణ నీకుఁ బుట్టితే కలసేవుగాక నేఁడే
వరుసఁ బెసఁగఁగాను వచ్చేదేమి
గరిమ నేరులు వానకాలమున మేఘాలు
కురిసినపాటి నీళ్లు పారుఁగాక
(॥దొర॥)
యేలితి శ్రీవేంకటేశ యీడేరించేవుగాక
కాలమెల్లాఁ గోరఁగాను కలిగేదేమి
తాలిమితోఁ జెఱకులు తతికాలమునాఁడు
చాలా ముదిరినపాటి చవివుట్టుఁగాక
(||pallavi||)
dŏravu sārĕgu ninnu dūravachchunā
yiravai nīve mammu nelevu gāga
(||dŏra||)
manasuvachchide nīve manniṁchevugāga mammu
yĕnalega kŏsaraṁgā nemi vachchīni
vanamuladīgĕlu vasaṁtagālamunām̐ḍu
ghanamai pūsinabāḍe kāsīm̐gāga
(||dŏra||)
karuṇa nīgum̐ buṭṭide kalasevugāga nem̐ḍe
varusam̐ bĕsam̐gam̐gānu vachchedemi
garima nerulu vānagālamuna meghālu
kurisinabāḍi nīḽlu pārum̐gāga
(||dŏra||)
yelidi śhrīveṁkaḍeśha yīḍeriṁchevugāga
kālamĕllām̐ goram̐gānu kaligedemi
tālimidom̐ jĕṟagulu tadigālamunām̐ḍu
sālā mudirinabāḍi savivuṭṭum̐gāga