Doravu neevannidaanu toyyali nenu

దొరవు నీవన్నిటాను తొయ్యలి నేను
Language

(॥పల్లవి॥)
దొరవు నీవన్నిటాను తొయ్యలి నేను
కరకరిఁ గక్కసించఁగలమా నేము

(॥దొర॥)
యేఁటికి నవ్వితివయ్యా యెఱఁగము నే మాపని
నాఁటకుఁడ వేమందుకునైనా వచ్చును
మూఁటగట్టి వలపుల మోపు నెత్తికి నెత్తేవు
గాఁటాన నింతేసి కోపఁగలమా నేము

(॥దొర॥)
చేసన్న లేఁటివయ్యా సిగ్గువడితిమి నేము
ఆసోద మెంత నీమనసందు నున్నదో
పూసగుచ్చి తరితీవు పొంచి మెడఁగట్టేవు
గాసించి నీతోఁ బెనఁగఁగలమా నేము

(॥దొర॥)
తప్పకచూచేవేమయ్యా దయలోవారము నేము
ఇప్పుడు శ్రీవేంకటేశ యెంతేమన్నాను
వొప్పగించినట్టు నీవొళ్ళు నాకాఁగిటి కిచ్చి
కప్పేవు మే లెదురాడఁగలమా నేము

(||pallavi||)
dŏravu nīvanniḍānu tŏyyali nenu
karagarim̐ gakkasiṁcham̐galamā nemu

(||dŏra||)
yem̐ṭigi navvidivayyā yĕṟam̐gamu ne mābani
nām̐ṭagum̐ḍa vemaṁdugunainā vachchunu
mūm̐ṭagaṭṭi valabula mobu nĕttigi nĕttevu
gām̐ṭāna niṁtesi kobam̐galamā nemu

(||dŏra||)
sesanna lem̐ṭivayyā sigguvaḍidimi nemu
āsoda mĕṁta nīmanasaṁdu nunnado
pūsaguchchi taridīvu pŏṁchi mĕḍam̐gaṭṭevu
gāsiṁchi nīdom̐ bĕnam̐gam̐galamā nemu

(||dŏra||)
tappagasūsevemayyā dayalovāramu nemu
ippuḍu śhrīveṁkaḍeśha yĕṁtemannānu
vŏppagiṁchinaṭṭu nīvŏḽḽu nāgām̐giḍi kichchi
kappevu me lĕdurāḍam̐galamā nemu