Doravaina nee todi pomdulu yettayinaa vachchu

దొరవైన నీ తోడి పొందులు యెట్టయినా వచ్చు
Language

(॥పల్లవి॥)
దొరవైన నీ తోడి పొందులు యెట్టయినా వచ్చు
మరకుండఁగరాదు మరగారాదు

(॥దొర॥)
యెంగిలినోర మాట యెటువలె నాడేను
సంగడిఁ బలుకనంటా సారె దూరేవు
రంగగువాఁడిచూపు లూరక ని న్నట్టు నాఁటింతు
అంగవించి శిరసెత్త నని కొసరేవు

(॥దొర॥)
చెమటచేతులను నీసేవ లెట్టు సేసేను
తమి విడెమియ్యనంటాఁ దత్తరించేవు
జమళిపాదాలు దాఁక సరినెట్టు గూచుండేను
అమర నీవద్దికి రానని సొలసేవు

(॥దొర॥)
కుప్పెలవంటి చన్నులఁ గుచ్చి నిన్నెట్టె త్తేను
అప్పుడే కాఁగిలించనైతి ననేవు
అప్పఁడ శ్రీవేంకటేశ అలమేలుమంగను నేను
యిప్పుడే కూడితి వింకా నేమని కోరేవు

(||pallavi||)
dŏravaina nī toḍi pŏṁdulu yĕṭṭayinā vachchu
maraguṁḍam̐garādu maragārādu

(||dŏra||)
yĕṁgilinora māḍa yĕḍuvalĕ nāḍenu
saṁgaḍim̐ baluganaṁṭā sārĕ dūrevu
raṁgaguvām̐ḍisūbu lūraga ni nnaṭṭu nām̐ṭiṁtu
aṁgaviṁchi śhirasĕtta nani kŏsarevu

(||dŏra||)
sĕmaḍasedulanu nīseva lĕṭṭu sesenu
tami viḍĕmiyyanaṁṭām̐ dattariṁchevu
jamaḽibādālu dām̐ka sarinĕṭṭu gūsuṁḍenu
amara nīvaddigi rānani sŏlasevu

(||dŏra||)
kuppĕlavaṁṭi sannulam̐ guchchi ninnĕṭṭĕ ttenu
appuḍe kām̐giliṁchanaidi nanevu
appam̐ḍa śhrīveṁkaḍeśha alamelumaṁganu nenu
yippuḍe kūḍidi viṁkā nemani korevu