దొరసి నీవెంత సిగ్గుతోడ మూసి దాఁచినాను
(॥పల్లవి॥)
దొరసి నీవెంత సిగ్గుతోడ మూసి దాఁచినాను
దొరయైనవానిచేఁత తుదకెక్కకుండనా
(॥దొర॥)
మంతనాన నీవు దను మన్నించినమన్ననలు
చెంతనున్న చెలులతోఁ జెప్పుకొన్నది
వింతలుగా వారివారు వీదువీదులఁ దమలోను
యింతికే వలతువంటా నెంచుకొంటానున్నారు
(॥దొర॥)
నగరిలొ నీవుఁ దానూ నవ్విననవ్వు లాకె
నిగిడి చిలుకకును నేరిపెనట
వొగి నాదండనుండిన వూరిచిలుకలు నేర్చి
పగలు రేయును నవే పలుకుతానున్నవి
(॥దొర॥)
పరగ నీకూటములు పాటలుగాఁ బాడఁగాను
నిరతి నచ్చరలెల్లా నేరుచుకొని
సిరులు నన్నేలినట్టె శ్రీవేంకటేశ్వర
ధరలో గీతాలుగా సంతతముఁ బాడేరు
(||pallavi||)
dŏrasi nīvĕṁta siggudoḍa mūsi dām̐sinānu
dŏrayainavānisem̐ta tudagĕkkaguṁḍanā
(||dŏra||)
maṁtanāna nīvu danu manniṁchinamannanalu
sĕṁtanunna sĕluladom̐ jĕppugŏnnadi
viṁtalugā vārivāru vīduvīdulam̐ damalonu
yiṁtige valaduvaṁṭā nĕṁchugŏṁṭānunnāru
(||dŏra||)
nagarilŏ nīvum̐ dānū navvinanavvu lāgĕ
nigiḍi silugagunu neribĕnaḍa
vŏgi nādaṁḍanuṁḍina vūrisilugalu nersi
pagalu reyunu nave palugudānunnavi
(||dŏra||)
paraga nīgūḍamulu pāḍalugām̐ bāḍam̐gānu
niradi nachcharalĕllā nerusugŏni
sirulu nannelinaṭṭĕ śhrīveṁkaḍeśhvara
dharalo gīdālugā saṁtadamum̐ bāḍeru