దొరకె మాపాలికిఁ గందువయర్థము
(॥పల్లవి॥)
దొరకె మాపాలికిఁ గందువయర్థము
దరిదాపై యుండిన తత్త్వార్థము
(॥దొర॥)
తిరముగ నల్లదీవిఁ దెచ్చిన యర్థమిదివో
విరజవోడరేవున వెళ్లినర్థము
పరమభాగవతులు పాఁతినర్థమిదివో
పురుషోత్తముఁడనేటి పురుషార్థము
(॥దొర॥)
చందపువేదముల(లు ? ) శాసనము వేసినర్థము
ముందు సుముద్రల కెల్లా మొదలర్థము
అందరి యాత్మలనేటి అంగళ్లలోనియర్థము
యెందు సహస్రనామపు టెన్నికర్థము
(॥దొర॥)
కొలచి బ్రహ్మాండముల కొప్పెరలో నర్థము
యిల నిహపరముల కెక్కినర్థము
యెలమి హీనునినై న యెక్కుడుసేసే యర్థము
అలరి శ్రీవేంకటేశుఁడై న యర్థము
(||pallavi||)
dŏragĕ mābāligim̐ gaṁduvayardhamu
daridābai yuṁḍina tattvārdhamu
(||dŏra||)
tiramuga nalladīvim̐ dĕchchina yardhamidivo
virajavoḍarevuna vĕḽlinardhamu
paramabhāgavadulu pām̐tinardhamidivo
puruṣhottamum̐ḍaneḍi puruṣhārdhamu
(||dŏra||)
saṁdabuvedamula(lu ? ) śhāsanamu vesinardhamu
muṁdu sumudrala kĕllā mŏdalardhamu
aṁdari yātmalaneḍi aṁgaḽlaloniyardhamu
yĕṁdu sahasranāmabu ṭĕnnigardhamu
(||dŏra||)
kŏlasi brahmāṁḍamula kŏppĕralo nardhamu
yila nihabaramula kĕkkinardhamu
yĕlami hīnuninai na yĕkkuḍusese yardhamu
alari śhrīveṁkaḍeśhum̐ḍai na yardhamu