దొరతో సంగాతము దొరకినపాటే చాలు
(॥పల్లవి॥)
దొరతో సంగాతము దొరకినపాటే చాలు
వొరసి మీరఁగఁ బోతే నొక్క రీతి నుండునా
(॥దొరతో॥)
యేకతాన లోన నుండి యేల నన్నుఁ బిలిచేవు
వాకిటికి రావయ్య వలసితేను
చేకొని యొకతె యుంటె సిగ్గుపడి వెళ్లి వచ్చి
కూకులు వత్తులు గాను కూళదాననా
(॥దొరతో॥)
మరిగించి మరఁగున మాట లే లాడించేవు
తెర దియ్యవయ్య అంత తీఁట గలితె
వరుసకు వచ్చినాపె వాదు నాతోఁ బెట్టుకొంటె
విరస మై యూరకుండ వెఱ్ఱిదాననా
(॥దొరతో॥)
పట్టెమంచముపై నుండి పైఁ గాలు చాఁచ నేల
యిట్టె వుర మెక్కవయ్య యింత గలితె
జట్టిగా శ్రీవెంకటేశ సరి నొకతె గూచుంటె
వట్టి యితపు సేసుకో వాసి లేనిదాననా
(||pallavi||)
dŏrado saṁgādamu dŏraginabāḍe sālu
vŏrasi mīram̐gam̐ bode nŏkka rīdi nuṁḍunā
(||dŏrado||)
yegadāna lona nuṁḍi yela nannum̐ bilisevu
vāgiḍigi rāvayya valasidenu
segŏni yŏgadĕ yuṁṭĕ siggubaḍi vĕḽli vachchi
kūgulu vattulu gānu kūḽadānanā
(||dŏrado||)
marigiṁchi maram̐guna māḍa le lāḍiṁchevu
tĕra diyyavayya aṁta tīm̐ṭa galidĕ
varusagu vachchinābĕ vādu nādom̐ bĕṭṭugŏṁṭĕ
virasa mai yūraguṁḍa vĕṭridānanā
(||dŏrado||)
paṭṭĕmaṁchamubai nuṁḍi paim̐ gālu sām̐sa nela
yiṭṭĕ vura mĕkkavayya yiṁta galidĕ
jaṭṭigā śhrīvĕṁkaḍeśha sari nŏgadĕ gūsuṁṭĕ
vaṭṭi yidabu sesugo vāsi lenidānanā