Dorado bomdu sesina toyyalula kedi vaadu

దొరతో బొందు సేసిన తొయ్యలుల కేది వాటు
Language

(॥పల్లవి॥)
దొరతో బొందు సేసిన తొయ్యలుల కేది వాటు
నెరపిన నిజమే నిష్టూరముగా

(॥దొర॥)
పేరుకొని పిలిచేవు పెడమొకము వెట్టేవు
యేరా నీవు సేసేవి యేఁటిచేఁతలు
చేరువకు రారాదు చెంగిచెంగి పోరాదు
సారె సారె చలివేఁడి చల్లేవుగా

(॥దొర॥)
పకపక నవ్వేవు పలికితే మానేవు
యెకసక్కేలేలివి మాతో యింతయేలరా
వెకలివై మీరరాదు వేసారుకొనఁగరాదు
వొకటఁ జేదునుఁ దీపు వునిచేవుగా

(॥దొర॥)
పానుపునఁ గూడేవు పరవశము నందేవు
మానవు గా యిటువంటిమాయలు నాతో
సోనగా శ్రీవేంకటేశ చొక్కొంచితివి రతుల
కానఁగానే పాలు నీరూఁ గలుపేవుగా

(||pallavi||)
dŏrado bŏṁdu sesina tŏyyalula kedi vāḍu
nĕrabina nijame niṣhṭūramugā

(||dŏra||)
perugŏni pilisevu pĕḍamŏgamu vĕṭṭevu
yerā nīvu sesevi yem̐ṭisem̐talu
seruvagu rārādu sĕṁgisĕṁgi porādu
sārĕ sārĕ salivem̐ḍi sallevugā

(||dŏra||)
pagabaga navvevu paligide mānevu
yĕgasakkelelivi mādo yiṁtayelarā
vĕgalivai mīrarādu vesārugŏnam̐garādu
vŏgaḍam̐ jedunum̐ dību vunisevugā

(||dŏra||)
pānubunam̐ gūḍevu paravaśhamu naṁdevu
mānavu gā yiḍuvaṁṭimāyalu nādo
sonagā śhrīveṁkaḍeśha sŏkkŏṁchidivi radula
kānam̐gāne pālu nīrūm̐ galubevugā