దొరతనములు చేసి దొరకొని చెనకీ
(॥పల్లవి॥)
దొరతనములు చేసి దొరకొని చెనకీ
నిరతి నా కాఁగిట నీవుండఁగను
(॥దొర॥)
కొత్తలుగా నదె కొల్లున నవ్వీ
గుత్తల గుబ్బల గొల్లెత
బిత్తరి చూపులఁ బెనఁగొనఁ జూచీ
జొత్తుల విడేల జూటు గొల్లెతా
(॥దొర॥)
మంకుల మాఁటలు మలయుచు నాడీ
కుంకుమ చెమటల గొల్లెత
అంకులు గాజులు నటు మొరయించీ
జంకెన బొమ్మల జాణ గొల్లెతా
(॥దొర॥)
చాడెల చల్లలు సారెకు నమ్మీ
కూడేటి వేడుక గొల్లెత
యీడనె శ్రీవేంకటేశ నీ వేలఁగ
తొడనె మెచ్చీ దొడ్డి గొల్లెతా
(||pallavi||)
dŏradanamulu sesi dŏragŏni sĕnagī
niradi nā kām̐giḍa nīvuṁḍam̐ganu
(||dŏra||)
kŏttalugā nadĕ kŏlluna navvī
guttala gubbala gŏllĕda
bittari sūbulam̐ bĕnam̐gŏnam̐ jūsī
jŏttula viḍela jūḍu gŏllĕdā
(||dŏra||)
maṁkula mām̐ṭalu malayusu nāḍī
kuṁkuma sĕmaḍala gŏllĕda
aṁkulu gājulu naḍu mŏrayiṁchī
jaṁkĕna bŏmmala jāṇa gŏllĕdā
(||dŏra||)
sāḍĕla sallalu sārĕgu nammī
kūḍeḍi veḍuga gŏllĕda
yīḍanĕ śhrīveṁkaḍeśha nī velam̐ga
tŏḍanĕ mĕchchī dŏḍḍi gŏllĕdā