Doradanamu sesem dumgabhadraadadamuna

దొరతనము సేసెఁ దుంగభద్రాతటమున
Language

(॥పల్లవి॥)
దొరతనము సేసెఁ దుంగభద్రాతటమున
సిరుల సుగ్రీవనరసింహదేవుఁడు

(॥దొర॥)
ఇందిరనుఁ దొడమీఁద నిడుకొని
పొందులసన్నల లోలోఁబొసఁగుకొని
అంది సరసపు మాఁ టలాడుకొని
చెంది నవ్వీ నిదె నరసింహదేవుఁడు

(॥దొర॥)
అదె పెండ్లి కూఁతురుఁ దానలముకొని
సదరాన మోవితేనె చవులుగొని
మదనకేలి యీపెతో మరుగుకొని
చెదరకున్నాఁడు నరసింహదేవుఁడు

(॥దొర॥)
దేవులుఁ దానుఁ దెప్పలఁదేలుకొని
వోవరిలో సంతోసాల నొనరుకొని
శ్రీవేంకటాద్రిమీఁద జెలఁగుకొని
చేవమీరి చొక్కీ నరసింహదేవుఁడు

(||pallavi||)
dŏradanamu sesĕm̐ duṁgabhadrādaḍamuna
sirula sugrīvanarasiṁhadevum̐ḍu

(||dŏra||)
iṁdiranum̐ dŏḍamīm̐da niḍugŏni
pŏṁdulasannala lolom̐bŏsam̐gugŏni
aṁdi sarasabu mām̐ ṭalāḍugŏni
sĕṁdi navvī nidĕ narasiṁhadevum̐ḍu

(||dŏra||)
adĕ pĕṁḍli kūm̐turum̐ dānalamugŏni
sadarāna movidenĕ savulugŏni
madanageli yībĕdo marugugŏni
sĕdaragunnām̐ḍu narasiṁhadevum̐ḍu

(||dŏra||)
devulum̐ dānum̐ dĕppalam̐delugŏni
vovarilo saṁtosāla nŏnarugŏni
śhrīveṁkaḍādrimīm̐da jĕlam̐gugŏni
sevamīri sŏkkī narasiṁhadevum̐ḍu