దొరపాటివాఁడు తాను దొరరీతి నుండఁడు
(॥పల్లవి॥)
దొరపాటివాఁడు తాను దొరరీతి నుండఁడు
వరుసలు మీరి వచ్చీ వద్దనరే చెలులూ
(॥దొరపాటి॥)
అంది నాకు బాగా లిచ్చి ఆకు మడి చిచ్చె నంటా
విందువలె నితఁ డేల వేఁడుకొనీనే
యెందు నూడిగపువార మింతే తనకు నేము
మందెమేళములు సేసీ మాను మన్న మానుఁడ
(॥దొరపాటి॥)
సరిఁ దానిలుచుండి మంచముపైఁ గూచుండుమంటా
అరుదుగ నన్ను నేల ఆన వెట్టినే
సరుసఁ దనకొలవుసతుల మింతే నేము
వెరవులు చెప్ప వచ్చీ వీఁడి దేమే నేఁడు
(॥దొరపాటి॥)
తల గుచ్చి కాఁగిలించి తమ్ముల మిడు మంటాను
బలిమి నేసి పెనఁగీ పచ్చిగాఁ దానూ
యిల శ్రీవెంకటేశుఁడు యిచ్చలోనివార మింతే
చాలి వాసి మమ్ముఁ గూడె చన వింత గలదా
(||pallavi||)
dŏrabāḍivām̐ḍu tānu dŏrarīdi nuṁḍam̐ḍu
varusalu mīri vachchī vaddanare sĕlulū
(||dŏrabāḍi||)
aṁdi nāgu bāgā lichchi āgu maḍi sichchĕ naṁṭā
viṁduvalĕ nidam̐ ḍela vem̐ḍugŏnīne
yĕṁdu nūḍigabuvāra miṁte tanagu nemu
maṁdĕmeḽamulu sesī mānu manna mānum̐ḍa
(||dŏrabāḍi||)
sarim̐ dānilusuṁḍi maṁchamubaim̐ gūsuṁḍumaṁṭā
aruduga nannu nela āna vĕṭṭine
sarusam̐ danagŏlavusadula miṁte nemu
vĕravulu sĕppa vachchī vīm̐ḍi deme nem̐ḍu
(||dŏrabāḍi||)
tala guchchi kām̐giliṁchi tammula miḍu maṁṭānu
balimi nesi pĕnam̐gī pachchigām̐ dānū
yila śhrīvĕṁkaḍeśhum̐ḍu yichchalonivāra miṁte
sāli vāsi mammum̐ gūḍĕ sana viṁta galadā