దొరపాటివాఁడతఁడు దొమ్మిసేతురా
(॥పల్లవి॥)
దొరపాటివాఁడతఁడు దొమ్మిసేతురా
తరుణులాల మీరు తరవు వెట్టుదురా
(॥దొర॥)
నామీఁది బత్తి గలిగితే నన్ను మన్నించీఁగాని
దోమటినాతని మీరు దూరకురే
ప్రేమములే నిజమైతే పిలువక వచ్చీఁగాని
కోమలులార మీరు కొంగు పట్టనేఁటికే
(॥దొర॥)
బాసలు నిజమయితేఁ బైకొని కూడీఁగాని
వేసరఁ బతిపైఁ దప్పు వేయకురే
ఆస వుట్టినపుడు తానండఁ బవ్వళించీఁగాని
రాసికెక్క నిందరిలో రవ్వ సేతురటవే
(॥దొర॥)
కరుణ వుట్టినపుడు కలసి నవ్వీఁగాని
సరుస శ్రీవేంకటేశు జరయకురే
యిరవుగ నన్ను నేలె యిట్టే వుండీఁగాని
నెరసి మీరు తొల్లిటి నేరములెంచకురే
(||pallavi||)
dŏrabāḍivām̐ḍadam̐ḍu dŏmmisedurā
taruṇulāla mīru taravu vĕṭṭudurā
(||dŏra||)
nāmīm̐di batti galigide nannu manniṁchīm̐gāni
domaḍinādani mīru dūragure
premamule nijamaide piluvaga vachchīm̐gāni
komalulāra mīru kŏṁgu paṭṭanem̐ṭige
(||dŏra||)
bāsalu nijamayidem̐ baigŏni kūḍīm̐gāni
vesaram̐ badibaim̐ dappu veyagure
āsa vuṭṭinabuḍu tānaṁḍam̐ bavvaḽiṁchīm̐gāni
rāsigĕkka niṁdarilo ravva seduraḍave
(||dŏra||)
karuṇa vuṭṭinabuḍu kalasi navvīm̐gāni
sarusa śhrīveṁkaḍeśhu jarayagure
yiravuga nannu nelĕ yiṭṭe vuṁḍīm̐gāni
nĕrasi mīru tŏlliḍi neramulĕṁchagure