Dooranela imka ninnu todamdodanu

దూరనేల ఇఁక నిన్ను తోడఁదోడను
Language

(॥పల్లవి॥)
దూరనేల ఇఁక నిన్ను తోడఁదోడను
వారికి వారే మెచ్చేరు వాడవాడను

(॥॥)
నటనల నీమాటలు నయగారాలు
ఘటనల మోము లంగడిబేరాలు
యెటువటె నిన్ను నెంచే దిఁక నేరాలు
తటుకున నాడరాదు తగవరిబీరాలు

(॥॥)
పేరడైన నీ నవ్వులు పెండ్లి సేసలు
వారక మంచితనాలు వట్టియాసలు
చేరిచేరి యేఁటికిఁ జేసేవు బాసలు
నారుకొనఁ గట్టితివి నాకు నల్లఁబూసలు

(॥॥)
తలకొని సేసేవు తరితీపులు
కలసితి వేఁటికి నింకా రాఁపులు
చలువాయ నాకు నీచల్లఁజూపులు
కలిగి శ్రీవేంకటేశ కాఁగిటి నీదాపులు

(||pallavi||)
dūranela im̐ka ninnu toḍam̐doḍanu
vārigi vāre mĕchcheru vāḍavāḍanu

(||||)
naḍanala nīmāḍalu nayagārālu
ghaḍanala momu laṁgaḍiberālu
yĕḍuvaḍĕ ninnu nĕṁche dim̐ka nerālu
taḍuguna nāḍarādu tagavaribīrālu

(||||)
peraḍaina nī navvulu pĕṁḍli sesalu
vāraga maṁchidanālu vaṭṭiyāsalu
seriseri yem̐ṭigim̐ jesevu bāsalu
nārugŏnam̐ gaṭṭidivi nāgu nallam̐būsalu

(||||)
talagŏni sesevu taridībulu
kalasidi vem̐ṭigi niṁkā rām̐pulu
saluvāya nāgu nīsallam̐jūbulu
kaligi śhrīveṁkaḍeśha kām̐giḍi nīdābulu