Dooram bodem gobamu doragu mukkuna numdu

దూరఁ బోతేఁ గోపము దొరకు ముక్కున నుండు
Language

(॥పల్లవి॥)
దూరఁ బోతేఁ గోపము దొరకు ముక్కున నుండు
వూరకే తోడుక రారే వొడఁబరచేనూ

(॥దర॥)
అవుఁగా దనకురే ఆడినట్టె ఆడనీరే
యివల నేనే చెప్పే నిన్ని బుద్దులు
తివిరి మీ రిందాఁకాఁ దెచ్చినదే మీపాలు
అవల నంతటిమీఁద నాతడు నాపాలు

(॥దర॥)
చేచేతఁ బెనఁగకురే సేసినట్టే సేయనీరే
యేచి నేనే సేవ సేసే నీడుకు నీడు
కాచిన మమ్మిద్దరినిఁ గదియించుట మీ పని
చూచి వానిఁ గరఁగించి చొక్కుట నా పని

(॥దర॥)
పంత మె ట్టైనై వచ్చి బలిమి సేయకురే
మంతనాన మెచ్చు సేసే మంకు లెల్లాను
యింతలో శ్రీవెంకటేశుఁ డిదే కదే నన్నుఁగూడె
వంతులే నీకుఁ జెల్లె వాసి నాకుఁ జెల్లె

(||pallavi||)
dūram̐ bodem̐ gobamu dŏragu mukkuna nuṁḍu
vūrage toḍuga rāre vŏḍam̐barasenū

(||dara||)
avum̐gā danagure āḍinaṭṭĕ āḍanīre
yivala nene sĕppe ninni buddulu
tiviri mī riṁdām̐kām̐ dĕchchinade mībālu
avala naṁtaḍimīm̐da nādaḍu nābālu

(||dara||)
sesedam̐ bĕnam̐gagure sesinaṭṭe seyanīre
yesi nene seva sese nīḍugu nīḍu
kāsina mammiddarinim̐ gadiyiṁchuḍa mī pani
sūsi vānim̐ garam̐giṁchi sŏkkuḍa nā pani

(||dara||)
paṁta mĕ ṭṭainai vachchi balimi seyagure
maṁtanāna mĕchchu sese maṁku lĕllānu
yiṁtalo śhrīvĕṁkaḍeśhum̐ ḍide kade nannum̐gūḍĕ
vaṁtule nīgum̐ jĕllĕ vāsi nāgum̐ jĕllĕ