దూతికలకు నీతోఁ బొద్దులు వుచ్చఁదగునా
(॥పల్లవి॥)
దూతికలకు నీతోఁ బొద్దులు వుచ్చఁదగునా
నీతిగాదు యీడనుంటే నింద వచ్చుఁ జుమ్మీ
(॥॥)
యేమని చెప్పుదు నేను యింతితో మారుమాటలు
నేమాన నన్ను నంపవు నీవును రావు
కోమలినే రమ్మందునో కొంత వోరుచుమందునో
జామువోయె నంపరాదా చాలుఁజాలు తడవు
(॥॥)
నేను వచ్చినపనికి నెలఁత కుత్తర మేది
పూని నాచేయి విడువవు పొందు గానము
నీనవ్వులు నెరుపేవో నిజమును నిట్లనో
కానీలే మమ్మంపరాదా కడుబలి మేఁటికి
(॥॥)
అంతేకదా ఆపెతోడి ఆడుకోలుమాట నీకు
ఇంతివాకిట నిలిచే వేమో నవ్వేవు
పంతాన శ్రీవేంకటేశ పడఁతిఁ గూడితి విట్టె
పొంతనే మమ్మంపరాదా పొసఁగె మాపనులు
(||pallavi||)
dūdigalagu nīdom̐ bŏddulu vuchcham̐dagunā
nīdigādu yīḍanuṁṭe niṁda vachchum̐ jummī
(||||)
yemani sĕppudu nenu yiṁtido mārumāḍalu
nemāna nannu naṁpavu nīvunu rāvu
komaline rammaṁduno kŏṁta vorusumaṁduno
jāmuvoyĕ naṁparādā sālum̐jālu taḍavu
(||||)
nenu vachchinabanigi nĕlam̐ta kuttara medi
pūni nāseyi viḍuvavu pŏṁdu gānamu
nīnavvulu nĕrubevo nijamunu niṭlano
kānīle mammaṁparādā kaḍubali mem̐ṭigi
(||||)
aṁtegadā ābĕdoḍi āḍugolumāḍa nīgu
iṁtivāgiḍa nilise vemo navvevu
paṁtāna śhrīveṁkaḍeśha paḍam̐tim̐ gūḍidi viṭṭĕ
pŏṁtane mammaṁparādā pŏsam̐gĕ mābanulu