దొమ్మి సరసాలాడితే దొరతనాలు సెల్లునా
(॥పల్లవి॥)
దొమ్మి సరసాలాడితే దొరతనాలు సెల్లునా
వుమ్మడినే పక్కనాయ నుండవయ్య నాయఁడా
(॥దొమ్మి॥)
వోసోసి నీవనఁగా వోరోరినేననఁగా
బేసిసరి మాట లివి బెరసి గారా
కాసు సేయని పనికి కల్లలు గారులు నీపై
మోసి రాఁగా మళ్ళీ మళ్ళీ మొక్కవద్దు నాయఁడా
(॥దొమ్మి॥)
సేయి నీవు లేయఁగా సెనకి కాలుఁదాఁకగా
నాయము వెంటవెంటనే నడసి గారా
ఆయములు సోఁక నాడి అలిగి నే నుండఁ గాను
కాయకమై మా వేళ గాయముద్దు నాయఁడా
(॥దొమ్మి॥)
కౌఁగిట నీ వంటఁగా సక్కని నాగోరు దాఁకఁగా
సేగలెక్కి వలపులు సిమిడి గారా
యేగి వచ్చి శ్రీవేంకటేశుఁడవై కూడితివి
బాగుగా యింతేసి కిందుపడవద్దు నాయఁడా
(||pallavi||)
dŏmmi sarasālāḍide dŏradanālu sĕllunā
vummaḍine pakkanāya nuṁḍavayya nāyam̐ḍā
(||dŏmmi||)
vososi nīvanam̐gā vororinenanam̐gā
besisari māḍa livi bĕrasi gārā
kāsu seyani panigi kallalu gārulu nībai
mosi rām̐gā maḽḽī maḽḽī mŏkkavaddu nāyam̐ḍā
(||dŏmmi||)
seyi nīvu leyam̐gā sĕnagi kālum̐dām̐kagā
nāyamu vĕṁṭavĕṁṭane naḍasi gārā
āyamulu som̐ka nāḍi aligi ne nuṁḍam̐ gānu
kāyagamai mā veḽa gāyamuddu nāyam̐ḍā
(||dŏmmi||)
kaum̐giḍa nī vaṁṭam̐gā sakkani nāgoru dām̐kam̐gā
segalĕkki valabulu simiḍi gārā
yegi vachchi śhrīveṁkaḍeśhum̐ḍavai kūḍidivi
bāgugā yiṁtesi kiṁdubaḍavaddu nāyam̐ḍā