Domadi gollavaarigi dosamu ledu

దోమటి గొల్లవారికి దోసము లేదు
Language

(॥పల్లవి॥)
దోమటి గొల్లవారికి దోసము లేదు
భామలాల మన నోము ఫలియించెఁ గదరె

(॥దోమ॥)
చింక చూపులనుఁజూచి సిగ్గులు పడకురే
యింకఁ గృష్ణునికిఁ జేతులెత్తి మొక్కరే
చంకల నిరుకకురే చన్నులు దాఁచుకొంటా
మంకుఁదనా లేలే వానిమాఁటలు వినఁగదరే

(॥దోమ॥)
సెలవుల నవ్వుకొంటా శిరసులు వంచకురే
వులివచ్చిచేఁతలకు నొడఁబడరే
నిలువెల్లా బారెఁడేసి నెరులఁ గప్పకురే
చేల రేఁగి యాతఁడు చెప్పినట్టు సేతమే

(॥దోమ॥)
కూరిమితోన నుండగా గుబ్బతిల నేఁటికే
చేరి యాతనిఁ బెండ్లాడి చెలఁగుదమే
యీరీతి శ్రీవేంకటేశుఁడింతలోన నిందరి నేలి
చీర లిచ్చె నిఁక వానిచెక్కులు నొక్కుదమే

(||pallavi||)
domaḍi gŏllavārigi dosamu ledu
bhāmalāla mana nomu phaliyiṁchĕm̐ gadarĕ

(||doma||)
siṁka sūbulanum̐jūsi siggulu paḍagure
yiṁkam̐ gṛṣhṇunigim̐ jedulĕtti mŏkkare
saṁkala nirugagure sannulu dām̐sugŏṁṭā
maṁkum̐danā lele vānimām̐ṭalu vinam̐gadare

(||doma||)
sĕlavula navvugŏṁṭā śhirasulu vaṁchagure
vulivachchisem̐talagu nŏḍam̐baḍare
niluvĕllā bārĕm̐ḍesi nĕrulam̐ gappagure
sela rem̐gi yādam̐ḍu sĕppinaṭṭu sedame

(||doma||)
kūrimidona nuṁḍagā gubbadila nem̐ṭige
seri yādanim̐ bĕṁḍlāḍi sĕlam̐gudame
yīrīdi śhrīveṁkaḍeśhum̐ḍiṁtalona niṁdari neli
sīra lichchĕ nim̐ka vānisĕkkulu nŏkkudame