దొడ్డవాఁడు దొరకొంటే తుదిమొదలెరఁగఁడు
(॥పల్లవి॥)
దొడ్డవాఁడు దొరకొంటే తుదిమొదలెరఁగఁడు
యెడ్డలము మా బోఁటి కిఁక నేఁటిదయ్యా
(॥దొడ్డ॥)
చెలులిద్దరిమీఁదను చేతులు చాఁచుకవుండి
యెలమి నాతో నవ్వేవిదేమయ్యా
వలపు సిగ్గెరఁగదు వడిననేమాటలు
యెలమి నీయందె కంటిమిఁక నేఁటిదయ్యా
(॥దొడ్డ॥)
మాటొక్కసతితోనాడి మనసొక్క కాంతకిచ్చి
యేఁటికి నాకు మోహించే విదేమయ్యా
పాటిలేనిది వయసు పట్టరాదనేటిమాట
యీటునఁ జెల్లబెట్టితి విఁకనేఁటిదయ్యా
(॥దొడ్డ॥)
కౌఁగిటనిద్దరిఁ బట్టి కతలు నాకుఁ జెప్పేవు
యేఁగక శ్రీవేంకటేశ యిదేమయ్యా
కాఁగిన యలమేల్‌మంగఁ గనక నన్నుఁ గూడితి-
వేఁగుబెండ్లి నీకుఁ జెల్లె నింకనేఁటిదయ్యా
(||pallavi||)
dŏḍḍavām̐ḍu dŏragŏṁṭe tudimŏdalĕram̐gam̐ḍu
yĕḍḍalamu mā bom̐ṭi kim̐ka nem̐ṭidayyā
(||dŏḍḍa||)
sĕluliddarimīm̐danu sedulu sām̐sugavuṁḍi
yĕlami nādo navvevidemayyā
valabu siggĕram̐gadu vaḍinanemāḍalu
yĕlami nīyaṁdĕ kaṁṭimim̐ka nem̐ṭidayyā
(||dŏḍḍa||)
māḍŏkkasadidonāḍi manasŏkka kāṁtagichchi
yem̐ṭigi nāgu mohiṁche videmayyā
pāḍilenidi vayasu paṭṭarādaneḍimāḍa
yīḍunam̐ jĕllabĕṭṭidi vim̐kanem̐ṭidayyā
(||dŏḍḍa||)
kaum̐giḍaniddarim̐ baṭṭi kadalu nāgum̐ jĕppevu
yem̐gaga śhrīveṁkaḍeśha yidemayyā
kām̐gina yalamelmaṁgam̐ ganaga nannum̐ gūḍidi-
vem̐gubĕṁḍli nīgum̐ jĕllĕ niṁkanem̐ṭidayyā