దొడ్డవాఁడైనవానికి దోసము లేదు
(॥పల్లవి॥)
దొడ్డవాఁడైనవానికి దోసము లేదు
వొడ్డారా లేమి సేసినా వొద్దనేవా రెవ్వరే
(॥దొడ్డ॥)
తప్పకచూచితేనే తనవొళ్లి నేరమెల్లా
కప్పి వూరివారికెల్లాఁ గానరాదా
ఇప్పుడే ఇందుకుఁగాను యేలబాసలుసేసీని
చొప్పుగా తప్పు గలితే సోదించేవా రెవ్వరే
(॥దొడ్డ॥)
మాటదీసి మాటాడితే మర్మములు మనవెల్లా
తేటతెల్లమీగా మాకుఁ దెలియరాదా
చాటి ఇందరిచేశాను సాకిరులేల చెప్పించీ
గాఁటాన మీరివచ్చితేఁ గాదనేవా రెవ్వరే
(॥దొడ్డ॥)
సంగడి గూచుండితేనే సరిఁ దనవల పెల్లా
యింగితాకారములోనే యెఱఁగరాదా
చెంగట నన్నేలినాఁడు శ్రీవేంకటేశ్వరుఁడు
కొంగు దాఁ బట్టితే నియ్యకొననివా రెవ్వరే
(||pallavi||)
dŏḍḍavām̐ḍainavānigi dosamu ledu
vŏḍḍārā lemi sesinā vŏddanevā rĕvvare
(||dŏḍḍa||)
tappagasūsidene tanavŏḽli neramĕllā
kappi vūrivārigĕllām̐ gānarādā
ippuḍe iṁdugum̐gānu yelabāsalusesīni
sŏppugā tappu galide sodiṁchevā rĕvvare
(||dŏḍḍa||)
māḍadīsi māḍāḍide marmamulu manavĕllā
teḍadĕllamīgā māgum̐ dĕliyarādā
sāḍi iṁdariseśhānu sāgirulela sĕppiṁchī
gām̐ṭāna mīrivachchidem̐ gādanevā rĕvvare
(||dŏḍḍa||)
saṁgaḍi gūsuṁḍidene sarim̐ danavala pĕllā
yiṁgidāgāramulone yĕṟam̐garādā
sĕṁgaḍa nannelinām̐ḍu śhrīveṁkaḍeśhvarum̐ḍu
kŏṁgu dām̐ baṭṭide niyyagŏnanivā rĕvvare