Doddavaamda vavuduvu doradanamulu sellu

దొడ్డవాఁడ వవుదువు దొరతనములు చెల్లు
Language

(॥పల్లవి॥)
దొడ్డవాఁడ వవుదువు దొరతనములు చెల్లు
వెడ్డువెట్టి వేఁడుకొని విచారించరాదా

(॥॥)
యేమిటికిఁ దలవంచే వెక్కడిపరాకు నీకు
కామిని నీచేతికిఁ గానుకియ్యఁగా
వాములుగా నీమీఁద వలపులు దొంతివెట్టి
మోము చూచీఁ జిత్తగించి ముచ్చటాడరాదా

(॥॥)
సిగ్గులేల నెరపేవు చిరునవ్వు లేలవచ్చె
వెగ్గళించి యాపె నీకు తమకము వడ్డికిచ్చి
తగ్గుమొగ్గులేక నీకు విందుచెప్పఁగా
యెగ్గులేనిముచ్చ టాడీ నిచ్చగించరాదా

(॥॥)
నీటులేల చూపేవు నీకునీకే అలసేవు
గాఁటపురతులఁ గూడి కాఁగిలించఁగా
పాటించి శ్రీ వేంకటేశ పాయము తరపువెట్టి
మేటిపంతములు చూపీ మేల మాడరాదా

(||pallavi||)
dŏḍḍavām̐ḍa vavuduvu dŏradanamulu sĕllu
vĕḍḍuvĕṭṭi vem̐ḍugŏni visāriṁcharādā

(||||)
yemiḍigim̐ dalavaṁche vĕkkaḍibarāgu nīgu
kāmini nīsedigim̐ gānugiyyam̐gā
vāmulugā nīmīm̐da valabulu dŏṁtivĕṭṭi
momu sūsīm̐ jittagiṁchi muchchaḍāḍarādā

(||||)
siggulela nĕrabevu sirunavvu lelavachchĕ
vĕggaḽiṁchi yābĕ nīgu tamagamu vaḍḍigichchi
taggumŏggulega nīgu viṁdusĕppam̐gā
yĕggulenimuchcha ṭāḍī nichchagiṁcharādā

(||||)
nīḍulela sūbevu nīgunīge alasevu
gām̐ṭaburadulam̐ gūḍi kām̐giliṁcham̐gā
pāḍiṁchi śhrī veṁkaḍeśha pāyamu tarabuvĕṭṭi
meḍibaṁtamulu sūbī mela māḍarādā