(॥పల్లవి॥)
దొడ్డదొర దానైతే దోసమాయనా
గొడ్డేరు నిష్టూరములే కూడాయనా
(॥దొడ్డ॥)
కాఁకలఁబెట్టినవాఁడు కన్నుల నవ్వీఁగదే
చీకాకై యాఁడు జన్మమే చెడఁబోయనా
చేకోని తా రానివాఁడు చెలులా నంపీఁగదే
కాకుసేసేదే తనకుఁ గడమాయనా
(॥దొడ్డ॥)
మోవఁగనాడినవాఁడు మోనాన నున్నాఁడుగదే
దావతితో వలచుటే తప్పాయనా
వావిదెలిపినవాఁడు వగల నేఁచీఁగదే
మావంటివారికన్నాఁరే మనసాయనా
(॥దొడ్డ॥)
పచ్చిగాఁ గూడినవాఁడు పంతము నాడీఁగదె
ముచ్చటలు చెప్పీనదే మోసమాయనా
ఇచ్చకుఁడు శ్రీవేంకటేశుఁడు నన్నేలె నిట్టె
పచ్చినాపాయమే తనపాలాయనా
(||pallavi||)
dŏḍḍadŏra dānaide dosamāyanā
gŏḍḍeru niṣhṭūramule kūḍāyanā
(||dŏḍḍa||)
kām̐kalam̐bĕṭṭinavām̐ḍu kannula navvīm̐gade
sīgāgai yām̐ḍu janmame sĕḍam̐boyanā
segoni tā rānivām̐ḍu sĕlulā naṁpīm̐gade
kāgusesede tanagum̐ gaḍamāyanā
(||dŏḍḍa||)
movam̐ganāḍinavām̐ḍu monāna nunnām̐ḍugade
dāvadido valasuḍe tappāyanā
vāvidĕlibinavām̐ḍu vagala nem̐sīm̐gade
māvaṁṭivārigannām̐re manasāyanā
(||dŏḍḍa||)
pachchigām̐ gūḍinavām̐ḍu paṁtamu nāḍīm̐gadĕ
muchchaḍalu sĕppīnade mosamāyanā
ichchagum̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu nannelĕ niṭṭĕ
pachchinābāyame tanabālāyanā