Divve yettina phalamu devara dimte kadave

దివ్వె యెత్తిన ఫలము దేవర దింతే కదవే
Language

(॥పల్లవి॥)
దివ్వె యెత్తిన ఫలము దేవర దింతే కదవే
యెవ్వతైనా నాయకుఁడు యేలేటివాఁడుఁ గదవే

(॥దివ్వె॥)
మతిలో సవతి వని మచ్చరము రేఁగినాను
అతనిఁ జూడవలెఁగా అవునే కదే
కతకారి నిన్నుఁ జూచి కడుఁ జలము లెక్కినాను
పతిబత్తి సేయఁగాను పదరరాదు గదవే

(॥దివ్వె॥)
వాలిననీసేఁత చూచి వాసి యెంత వుట్టినాను
లాలించి యతనిమాట చెల్లవలెఁ గదే
పాలుపడి నీ జాడకు పంతము నాకు నెక్కినాను
తాలిమితో నా గుణము దలఁచవలెఁ గదవే

(॥దివ్వె॥)
జోడై నీ వున్నందుకు సూడెంత గలిగినాను
వేడుక నాతనిబుద్ది వినేదే కదే
యీడనే శ్రీవేంకటేశుఁ డే నలమేల్మంగను
కూడె నిన్నుఁ జెల్లెలిఁగాఁ గూర్చుకోవలెఁ గదవే

(||pallavi||)
divvĕ yĕttina phalamu devara diṁte kadave
yĕvvadainā nāyagum̐ḍu yeleḍivām̐ḍum̐ gadave

(||divvĕ||)
madilo savadi vani machcharamu rem̐ginānu
adanim̐ jūḍavalĕm̐gā avune kade
kadagāri ninnum̐ jūsi kaḍum̐ jalamu lĕkkinānu
padibatti seyam̐gānu padararādu gadave

(||divvĕ||)
vālinanīsem̐ta sūsi vāsi yĕṁta vuṭṭinānu
lāliṁchi yadanimāḍa sĕllavalĕm̐ gade
pālubaḍi nī jāḍagu paṁtamu nāgu nĕkkinānu
tālimido nā guṇamu dalam̐savalĕm̐ gadave

(||divvĕ||)
joḍai nī vunnaṁdugu sūḍĕṁta galiginānu
veḍuga nādanibuddi vinede kade
yīḍane śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelmaṁganu
kūḍĕ ninnum̐ jĕllĕlim̐gām̐ gūrsugovalĕm̐ gadave