దిట్టవన్నిటాఁ దొల్లే తేరినవాఁడవు నీవు
(॥పల్లవి॥)
దిట్టవన్నిటాఁ దొల్లే తేరినవాఁడవు నీవు
గట్టిగా నిన్నుఁ జేపట్టుట గాక
(॥॥)
అలరి నీవు రావని అలుగఁగఁ దగునా
నలుగడ సెలవుల నవ్వుట గాక
కలయవనుచు నిన్నుఁ గసరఁగఁ దగునా
మొలకసిగ్గుతోడ మొక్కుట గాక
(॥॥)
కడలు దొక్కితివని కాఁతాళించఁ దగునా
మెడమెత్తి సారె నిన్ను మెచ్చుట గాక
అడియాలాలెల్లాఁ జూచి అట్టే తిట్టఁదగునా
గొడవలేక నిన్నుఁ గొలుచుట గాక
(॥॥)
పాసి వుంటివని నీతోఁ బదరఁగఁ దగునా
రేసులకు నిన్నుఁ గాఁగిలించుట గాక
యీసు దీరె శ్రీవేంకటేశ నన్నేనసితివి
సేసవెట్టి యిఁకనిట్టే చెలఁగుటగాకా
(||pallavi||)
diṭṭavanniḍām̐ dŏlle terinavām̐ḍavu nīvu
gaṭṭigā ninnum̐ jebaṭṭuḍa gāga
(||||)
alari nīvu rāvani alugam̐gam̐ dagunā
nalugaḍa sĕlavula navvuḍa gāga
kalayavanusu ninnum̐ gasaram̐gam̐ dagunā
mŏlagasiggudoḍa mŏkkuḍa gāga
(||||)
kaḍalu dŏkkidivani kām̐tāḽiṁcham̐ dagunā
mĕḍamĕtti sārĕ ninnu mĕchchuḍa gāga
aḍiyālālĕllām̐ jūsi aṭṭe tiṭṭam̐dagunā
gŏḍavalega ninnum̐ gŏlusuḍa gāga
(||||)
pāsi vuṁṭivani nīdom̐ badaram̐gam̐ dagunā
resulagu ninnum̐ gām̐giliṁchuḍa gāga
yīsu dīrĕ śhrīveṁkaḍeśha nannenasidivi
sesavĕṭṭi yim̐kaniṭṭe sĕlam̐guḍagāgā