Dishtamu soosidim dammu deveedevaraa vale

దిష్టము చూచితిఁ దమ్ము దేవీదేవరా వలె
Language

(॥పల్లవి॥)
దిష్టము చూచితిఁ దమ్ము దేవీదేవరా వలె
నిష్టూరము లేనిదే నిండుదొరతనము

(॥దిష్ట॥)
చేతికి లోనై నపొందు సేసితే దోసము గాదు
ఆతుమైనవారిమాట లాదరింతురు
యేతులకు నవ్వితేను యెగ్గు లెంచఁ బనిలేదు
యీతల నన్ను జూచి తా నేల సిగ్గువడీనే

(॥దిష్ట॥)
మొదలి చుట్టరికము మొగమోడకుండ రాదు
కదిసి పైకొనఁగా కాదన నేల
మదిలోనితమకము మరి దాఁచ నేఁటికి
యెదుట నే నుండఁగాను యింతకొంక వలెనా

(॥దిష్ట॥)
రతి కెక్కినవెనక రాఁపులు సేయఁదగదు
తతి వచ్చినప్పుడు దాఁతురా మేలు
యితవుగా శ్రీవేంకటేశుఁడు తా ననుఁ గూడె
సతమైతి నామోము చక్కఁ జూడుమనవే

(||pallavi||)
diṣhṭamu sūsidim̐ dammu devīdevarā valĕ
niṣhṭūramu lenide niṁḍudŏradanamu

(||diṣhṭa||)
sedigi lonai nabŏṁdu seside dosamu gādu
ādumainavārimāḍa lādariṁturu
yedulagu navvidenu yĕggu lĕṁcham̐ baniledu
yīdala nannu jūsi tā nela sigguvaḍīne

(||diṣhṭa||)
mŏdali suṭṭarigamu mŏgamoḍaguṁḍa rādu
kadisi paigŏnam̐gā kādana nela
madilonidamagamu mari dām̐sa nem̐ṭigi
yĕduḍa ne nuṁḍam̐gānu yiṁtagŏṁka valĕnā

(||diṣhṭa||)
radi kĕkkinavĕnaga rām̐pulu seyam̐dagadu
tadi vachchinappuḍu dām̐turā melu
yidavugā śhrīveṁkaḍeśhum̐ḍu tā nanum̐ gūḍĕ
sadamaidi nāmomu sakkam̐ jūḍumanave