దినదినము నిట్ల నెడతెగకుండ సన్న సేసే
(॥పల్లవి॥)
దినదినము నిట్ల నెడతెగకుండ సన్న సేసే
యెనయు నాయకు నింక నెట్టు దెలిసేదే
(॥దిన॥)
కనుఁగొనల నొకదినము కాంత యిక్కువ చెప్పె
దిన మొకటి మోమునను తిరుగఁ జెప్పె
వొనర నధరమున వేరొకదినము గుఱి చెప్పె
పొనిగి రమణునిఁ జెలియ పొద్దులే కడపె
(॥దిన॥)
నడుమ నొకదినము చిన్నాణమునఁ బొందు చెప్పె
దిడువుఁగుచముల నొక్కదినము చెప్పె
తొడరి కొనగోరికాంతుల నొకదినము చెప్పెఁ
గడుఁజెలియ పతి కిట్లఁ గాలమే జరపె
(॥దిన॥)
గమనముల నొకదినము కలయుపొ ద్దెఱిగించె
అమర నిదే శ్రీవేంకటాధిపునకు
సమరతుల సరసముల సకలరతిబంధముల
కమలముఖి యీతనికిఁ గందువలే తెలిపె
(||pallavi||)
dinadinamu niṭla nĕḍadĕgaguṁḍa sanna sese
yĕnayu nāyagu niṁka nĕṭṭu dĕlisede
(||dina||)
kanum̐gŏnala nŏgadinamu kāṁta yikkuva sĕppĕ
dina mŏgaḍi momunanu tirugam̐ jĕppĕ
vŏnara nadharamuna verŏgadinamu guṟi sĕppĕ
pŏnigi ramaṇunim̐ jĕliya pŏddule kaḍabĕ
(||dina||)
naḍuma nŏgadinamu sinnāṇamunam̐ bŏṁdu sĕppĕ
diḍuvum̐gusamula nŏkkadinamu sĕppĕ
tŏḍari kŏnagorigāṁtula nŏgadinamu sĕppĕm̐
gaḍum̐jĕliya padi kiṭlam̐ gālame jarabĕ
(||dina||)
gamanamula nŏgadinamu kalayubŏ ddĕṟigiṁchĕ
amara nide śhrīveṁkaḍādhibunagu
samaradula sarasamula sagalaradibaṁdhamula
kamalamukhi yīdanigim̐ gaṁduvale tĕlibĕ