దిక్కులు సాధించఁబూని దేవదుందుభులు మ్రోయ
(॥పల్లవి॥)
దిక్కులు సాధించఁబూని దేవదుందుభులు మ్రోయ
యెక్కువతో శ్రీవేంకటేశుఁ డెక్కెఁ దేరు
(॥దిక్కు॥)
పన్నిద్దరు సూరియుల బండికండ్లతేరు
సన్నుతి శేషాదిదేవాసనపుఁ దేరు
కన్నులపండుగైన గరుడధ్వజపుఁ దేరు
యెన్నఁగ శ్రీవేంకటేశుఁ డెక్కె నిదె తేరు
(॥దిక్కు॥)
మించు నానా మేఘముల మేలుకట్ల తేరు
చుంచులనక్షత్రాల కుచ్చుల తేరు
అంచెదేవతలే బొమ్మలై వుండినట్టి తేరు
యెంచఁగ శ్రీవేంకటేశుఁ డెక్కె నిదె తీరు
(॥దిక్కు॥)
అట్టె కిం దేడులోకము లంతరువులైన తేరు
నట్టనడుమను బ్రహ్మాండపు తేరు
దిట్ట యలమేల్మంగతోఁ దిరమైవుండేటి తేరు
యిట్టె శ్రీవేంకటేశుఁ డెక్కె నిదె తేరు
(||pallavi||)
dikkulu sādhiṁcham̐būni devaduṁdubhulu mroya
yĕkkuvado śhrīveṁkaḍeśhum̐ ḍĕkkĕm̐ deru
(||dikku||)
panniddaru sūriyula baṁḍigaṁḍladeru
sannudi śheṣhādidevāsanabum̐ deru
kannulabaṁḍugaina garuḍadhvajabum̐ deru
yĕnnam̐ga śhrīveṁkaḍeśhum̐ ḍĕkkĕ nidĕ teru
(||dikku||)
miṁchu nānā meghamula melugaṭla teru
suṁchulanakṣhatrāla kuchchula teru
aṁchĕdevadale bŏmmalai vuṁḍinaṭṭi teru
yĕṁcham̐ga śhrīveṁkaḍeśhum̐ ḍĕkkĕ nidĕ tīru
(||dikku||)
aṭṭĕ kiṁ deḍulogamu laṁtaruvulaina teru
naṭṭanaḍumanu brahmāṁḍabu teru
diṭṭa yalamelmaṁgadom̐ diramaivuṁḍeḍi teru
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍĕkkĕ nidĕ teru