దిక్కులను మగవాఁడు ధీరుఁడందురు
(॥పల్లవి॥)
దిక్కులను మగవాఁడు ధీరుఁడందురు
యెక్కడికెక్కడ మోహ మింత సేతురా
(॥దిక్కు॥)
నిడువాలుఁ గన్నులను నెలఁత నిన్నుఁ జూచితే
తడసి నీమన సాపెఁ దగిలున్నది
వడి నీవద్దనుండినవారి నెఱఁగ విందుకు
వారిది చూఁచితే గక్కనను నవ్వరా
(॥దిక్కు॥)
మచ్చికల నీయెదుట మాటలాడినంతలోనె
అచ్చపునీమోహ మాపె నంటుకున్నది
నిచ్చలాన నాఁకలియు నీరువట్టూ నెఱఁగవు
హెచ్చిననీసతులెల్లా నిందు కిట్టె నవ్వరా
(॥దిక్కు॥)
ఆయమెరిఁగి కొసరి ఆసఇచ్చినంతలోనే
చాయల శ్రీవేంకటేశ సతిఁ గూడితి
పాయక ఆపెతో రేయిఁబగ లేమీ నెఱఁగవు
యీయెడ నేనూఁ గూడితి నిఁక లోలో నవ్వరా
(||pallavi||)
dikkulanu magavām̐ḍu dhīrum̐ḍaṁduru
yĕkkaḍigĕkkaḍa moha miṁta sedurā
(||dikku||)
niḍuvālum̐ gannulanu nĕlam̐ta ninnum̐ jūside
taḍasi nīmana sābĕm̐ dagilunnadi
vaḍi nīvaddanuṁḍinavāri nĕṟam̐ga viṁdugu
vāridi sūm̐side gakkananu navvarā
(||dikku||)
machchigala nīyĕduḍa māḍalāḍinaṁtalonĕ
achchabunīmoha mābĕ naṁṭugunnadi
nichchalāna nām̐kaliyu nīruvaṭṭū nĕṟam̐gavu
hĕchchinanīsadulĕllā niṁdu kiṭṭĕ navvarā
(||dikku||)
āyamĕrim̐gi kŏsari āsa̮ichchinaṁtalone
sāyala śhrīveṁkaḍeśha sadim̐ gūḍidi
pāyaga ābĕdo reyim̐baga lemī nĕṟam̐gavu
yīyĕḍa nenūm̐ gūḍidi nim̐ka lolo navvarā